మరో వారంలో.. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2

| Edited By: Pardhasaradhi Peri

Aug 13, 2019 | 6:53 AM

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌2 మరో వారంలో చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విశేషాలను పంచుకున్నారు. గత నెల జులై 22న చంద్రయాన్‌-2ను […]

మరో వారంలో.. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్2
Follow us on

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌2 మరో వారంలో చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఈ నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించి.. సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అవుతుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్‌ సారాభాయ్‌ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్‌ 2 విశేషాలను పంచుకున్నారు. గత నెల జులై 22న చంద్రయాన్‌-2ను ప్రయోగించిన తర్వాత.. ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు ప్రతి ప్రక్రియ విజయవంతమైందని.. ఇక అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నాట్లు తెలిపారు.
ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్‌-లూనార్‌ ఇంజెక్షన్‌ ప్రక్రియ జరుపుతామన్నారు. దీంతో చంద్రయాన్‌ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుందని తెలిపారు. ఆ తర్వాత లూనార్‌ ఆర్బిట్‌ ఇన్సర్షన్‌ ప్రక్రియ చేపడతామని.. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుందన్నారు. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుందన్నారు.