ఇక అందుబాటులో బ్లూటూత్ హెల్మెట్!

| Edited By:

Apr 16, 2019 | 1:22 PM

వేగ హెల్మెట్లు చాలా పాపులర్. ఈ కంపెనీ ఇప్పుడు ఇవో బీటీ పేరుతో మరో కొత్త హెల్మెట్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ధర రూ.2,996. ఇతర హెల్మెట్ల మాదిరి కాకుండా.. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. బ్లూటూత్ సదుపాయం ఉంది. అంటే హెల్మెట్‌లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ హెల్మెట్‌లో మ్యూజిక్ వినొచ్చు. వాయిస్ అసిస్టెడ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. ఆటోమేటిక్ కాల్ ఆన్సరింగ్ ఫీచర్ వల్ల ఫోన్ బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా […]

ఇక అందుబాటులో బ్లూటూత్ హెల్మెట్!
Follow us on

వేగ హెల్మెట్లు చాలా పాపులర్. ఈ కంపెనీ ఇప్పుడు ఇవో బీటీ పేరుతో మరో కొత్త హెల్మెట్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. దీని ధర రూ.2,996.

ఇతర హెల్మెట్ల మాదిరి కాకుండా.. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. బ్లూటూత్ సదుపాయం ఉంది. అంటే హెల్మెట్‌లోనే కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఈ హెల్మెట్‌లో మ్యూజిక్ వినొచ్చు. వాయిస్ అసిస్టెడ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది. ఆటోమేటిక్ కాల్ ఆన్సరింగ్ ఫీచర్ వల్ల ఫోన్ బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా కాల్స్ మాట్లాడొచ్చు.

ఈ హెల్మెట్‌ ఐఎస్ఐ సర్టిఫైడ్. మీడియం, లార్జ్ సైజ్‌లలో అందుబాటులో ఉంది. హెల్మెట్‌లో బ్యాటరీ ఉంటుంది. చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎంత చార్జింగ్ ఉందో స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై చూడొచ్చు. ఈ హెల్మెట్ కేవలం నలుపు రంగులో మాత్రమే అందుబాటులో ఉంది.