చైనాకు షాకిచ్చిన యాపిల్‌ సంస్థ

| Edited By:

Jul 05, 2020 | 2:16 PM

ఇప్పటికే భారత ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్‌ స్ట్రైక్స్‌తో వేల కోట్లలో నష్టాన్ని చవిచూస్తున్న చైనాకు.. దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్‌ కూడా ఊహించని షాక్‌ ఇచ్చింది.

చైనాకు షాకిచ్చిన యాపిల్‌ సంస్థ
Follow us on

ఇప్పటికే భారత ప్రభుత్వం ఇచ్చిన డిజిటల్‌ స్ట్రైక్స్‌తో వేల కోట్లలో నష్టాన్ని చవిచూస్తున్న చైనాకు.. దిగ్గజ మొబైల్ సంస్థ యాపిల్‌ కూడా ఊహించని షాక్‌ ఇచ్చింది. చైనీస్‌ యాప్‌ స్టోర్‌లోని దాదాపు 4500 మొబైల్‌ గేమ్స్‌ను యాపిల్‌ తొలగించింది. దీంతో చైనా కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో పలు సంస్కరణలకు యాపిల్‌ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే చైనా గేమ్స్‌ను‌ తొలగించినట్లు ప్రకటించింది.

చట్టపరమైన అనుమతి లేని చాలా గేమ్స్‌ యాప్‌లలో ఉంచుతున్నారని, ఇకపై వాటికి ఆస్కారం లేకుండా చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. అయినా లైసెన్స్‌ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని తాము గత ఏడాదే ప్రకటించినట్లు గుర్తు చేసింది. ఈ క్రమంలోనే జూన్‌ 30 నుంచి చైనాకు చెందిన గేమ్స్‌ను యాప్‌ నుంచి తొలగిస్తున్నామని యాపిల్‌ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. కావాలంటే లైసెన్స్‌ నిబంధనలను పునరుద్ధించి చట్ట ప్రకారం అప్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.