లాంచ్ అయిన యాపిల్ కొత్త ఫోన్.. వినూత్న ఫీచర్లు ఇవే

| Edited By:

Jun 23, 2020 | 12:04 PM

యాపిల్ సంస్థ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. 'డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020' కార్యక్రమంలో కొత్త ఫోన్ 'ఐఓఎస్ 14'ను లాంచ్ చేశారు సంస్థ సీఈవో టిక్ కుక్.

లాంచ్ అయిన యాపిల్ కొత్త ఫోన్.. వినూత్న ఫీచర్లు ఇవే
Follow us on

యాపిల్ సంస్థ నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది. ‘డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020’ కార్యక్రమంలో కొత్త ఫోన్ ‘ఐఓఎస్ 14’ను లాంచ్ చేశారు సంస్థ సీఈవో టిక్ కుక్. ఇక ఇంతకాలం ఇంటెల్ చిప్ సెట్ ఆధారిత మ్యాక్‌లను ఆధారపడిన యాపిల్.. ఇకపై సొంత చిప్‌ను ఉపయోగించబోతున్నట్లు కుక్ తెలిపారు. కాగా ఈ ఫోన్ విశేషాలను సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిడ్ ఫెడిరిగీ వెల్లడించారు.

ఐఓఎస్ 14 ఫీచర్లు:
యాప్ లైబ్రరీ- ఇది ఫోల్డర్ సిస్టమ్‌: మనకు కావాల్సిన యాప్‌లను ఆర్గనైజ్ చేసుకొని ఫోల్డర్‌లో పెట్టుకోవచ్చు. స్క్రీన్‌ను స్వైప్ చేయడం ద్వారా వీటిని చూసుకోవచ్చు. తాత్కాలికంగా అవసరం లేని యాప్‌లను ఇందులో దాచుకోవచ్చు.
స్మార్ట్ స్టాక్ విజట్: ఈ ఫీచర్ సహాయంతో గతం కంటే మరింత మెరుగ్గా విజట్స్‌ను ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా విజట్‌లను మార్చుకునే వీలు కూడా ఉంటుంది.
పిక్చర్ ఇన్ పిక్చర్: ఏదైనా వీడియోను ఓపెన్ చేసి, యాప్‌ను మినిమైజ్ చేస్తే, చిన్న విండోలో ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఈ వీడియోను స్వైప్ చేసి, స్క్రీన్‌పై నుంచి తొలగించి, ఆడియోను వినే సదుపాయం ఉంటుంది.
సిరి: ఈ యాప్ ద్వారా వివిధ భాషల అనువాదాన్ని నెట్ లేకుండా కూడా చేసుకోవచ్చు.

వీటితో పాటు మెసేజ్ అప్‌డేట్, ఎమోజీ కస్టమైజేషన్ ఆప్షన్, ఇన్‌లైన్ రిప్లయ్ టూ ఐమెసేజ్ సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి . ఇక యాపిల్ మ్యాప్స్, సైక్లింగ్ డైరెక్షన్స్‌ తదితరాల్లో మార్పులు, చేర్పులు చేశారు. ఈవీ రూటింగ్ పేరిట కొత్త ఫీచర్‌ను జోడించారు. అలాగే ఫోన్‌ను ఇన్‌ కార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మార్చేందుకు కార్‌ ప్లే మోడ్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా ఫోన్‌ను కారుకు తాళంగా వాడుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌కు సంబంధించి మరో ముఖ్యమైన అప్‌డేట్ ఏంటంటే.. యాప్‌ను ఇన్‌స్టాల్ చేయకుండానే వాడుకోవచ్చు. ఇందుకోసం యాప్ క్లిప్స్ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది యాపిల్ సంస్థ.

Read This Story Also: కీర్తి సినిమాకు రష్మిక రివ్యూ