యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు

| Edited By:

Apr 04, 2019 | 3:14 PM

యాపిల్ ఫోన్‌ కొనాలనుకున్న వారికి శుభవార్త. ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌లోని అన్ని వేరియంట్లపై రూ.17,000 తగ్గించింది యాపిల్ సంస్థ. ఏప్రిల్ 5నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానుండగా.. కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉండనుంది. కాగా ప్రస్తుతం ఐఫోన్ ఎక్స్‌ఆర్(64జీబీ) ధర రూ.76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఈ ఫోన్ రూ.59,900కే రానుంది. అలాగే 128జీబీ ఎక్స్ఆర్ రూ.64,900కు (ప్రస్తుత ధర రూ.81,900).. 256జీబీ ఎక్స్ఆర్ రూ. 74, 900(ప్రస్తుత ధర రూ.91,900)లకే రానున్నాయి. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ […]

యాపిల్ ఐఫోన్లపై భారీ తగ్గింపు
Follow us on

యాపిల్ ఫోన్‌ కొనాలనుకున్న వారికి శుభవార్త. ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్‌లోని అన్ని వేరియంట్లపై రూ.17,000 తగ్గించింది యాపిల్ సంస్థ. ఏప్రిల్ 5నుంచి ఈ ధరలు అందుబాటులోకి రానుండగా.. కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉండనుంది.

కాగా ప్రస్తుతం ఐఫోన్ ఎక్స్‌ఆర్(64జీబీ) ధర రూ.76,900గా ఉంది. డిస్కౌంట్‌పై ఈ ఫోన్ రూ.59,900కే రానుంది. అలాగే 128జీబీ ఎక్స్ఆర్ రూ.64,900కు (ప్రస్తుత ధర రూ.81,900).. 256జీబీ ఎక్స్ఆర్ రూ. 74, 900(ప్రస్తుత ధర రూ.91,900)లకే రానున్నాయి. అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ తెలిపింది.

అయితే శాంసంగ్, షామీలాంటి కంపెనీల నుంచి పోటీ అధికంగా ఉండటంతో ఇటీవల కాలంలో భారత్‌లో ఐఫోన్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ కొనుగోళ్లను పెంచుకునేందుకు కంపెనీ ఈ డిస్కౌంట్ ఆఫర్‌ తీసుకొచ్చిందని యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు.