‘ఏజెంట్ స్మిత్’ మాల్‌వేర్… స్మార్ట్‌ఫోన్ యూజర్లూ జర జాగ్రత్త!

| Edited By:

Jul 12, 2019 | 8:12 PM

వాట్సప్ ఓపెన్ చేయగానే యాడ్ కనిపిస్తోందా? అయితే ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. మీ ఫోన్‌లోకి ఏజెంట్ స్మిత్ ఎంటరయిందని అనుమానించాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లను ఏజెంట్ స్మిత్ వైరస్ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ మాల్ వేర్ దాడి చేసిందని చెక్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రకటించింది. అందులో భారతదేశానికి చెందిన ఫోన్లే 1.5 కోట్లు. ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై జరిగిన అతి పెద్ద దాడి […]

ఏజెంట్ స్మిత్ మాల్‌వేర్... స్మార్ట్‌ఫోన్ యూజర్లూ జర జాగ్రత్త!
Follow us on

వాట్సప్ ఓపెన్ చేయగానే యాడ్ కనిపిస్తోందా? అయితే ఒక్క నిమిషం ఆలోచించాల్సిందే. మీ ఫోన్‌లోకి ఏజెంట్ స్మిత్ ఎంటరయిందని అనుమానించాల్సిందే. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యూజర్లను ఏజెంట్ స్మిత్ వైరస్ భూతం భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా 2.5కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ మాల్ వేర్ దాడి చేసిందని చెక్ పాయింట్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ప్రకటించింది. అందులో భారతదేశానికి చెందిన ఫోన్లే 1.5 కోట్లు. ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై జరిగిన అతి పెద్ద దాడి అని భావిస్తున్నారు టెక్ నిపుణులు. ఆండ్రాయిడ్ యూజర్లు గుర్తించకుండా ‘ఏజెంట్ స్మిత్’ మాల్‌వేర్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై దాడి చేస్తున్నట్టు గుర్తించారు. ఈ మాల్‌వేర్ ఎలాంటి డేటా తస్కరించట్లేదని, కేవలం యాడ్స్ డిస్‌ప్లే చేయడానికి మాత్రమేనని ప్రస్తుతానికి గుర్తించారు. సాధారణంగా యూజర్లు థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడే ఈ మాల్‌వేర్ ఎటాక్ చేసే ముప్పు పొంచి ఉంది. థర్డ్ పార్టీ యాడ్ డౌన్‌లోడ్ చేసుకోగానే గూగుల్ అప్‌డేటింగ్ టూల్‌లాగా ఫోన్‌లోకి ఎంటర్ అవుతుంది. ఈ యాప్ ఇన్‌స్టాల్ అయినా స్క్రీన్ పైన ఐకాన్ కనిపించదు.

గూగుల్‌కు సంబంధించిన అప్లికేషన్‌లా ఫోన్‌లోకి చొరబడి ఆండ్రాయిడ్‌పై దాడి చేసి, యూజర్లకు తెలియకుండా ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ని రీప్లేస్ చేస్తుందని అని ఇజ్రాయిల్ సెక్యూరిటీ సంస్థ చెక్‌పాయింట్ వెల్లడించింది. ఈ మాల్‌వేర్ డబ్బు కోసం మోసపూరిత యాడ్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. మీ బ్యాంకు వివరాలను, ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకొనే ప్రమాదం ఉందని, గతంలో కలకలం రేపిన Gooligan, Hummingbad, CopyCat లాంటి మాల్‌వేర్ దాడుల్లాగే ఇది కూడా ఉంటుందని చెక్‌పాయింట్ వివరించింది. ఈ మాల్‌వేర్ ఎక్కువగా హిందీ, అరబిక్, రష్యన్, ఇండోనేషియన్ మాట్లాడే యూజర్లనే టార్గెట్ చేసింది. అందుకే ఎక్కువ బాధితులు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఉన్నారు.