ఆ మహిళా జడ్జికి శాశ్వత హోదాపై సిఫారసు ఉపసంహరణ, సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం.

బాంబే హైకోర్టు జడ్జి పుష్ప గనెడివాలాకు శాశ్వత హోదా కల్పించాలన్న తన సిఫారసును సుప్రీంకోర్టు కొలీజియం ఉపసంహరించుకుంది. ఇది చాలా అరుదైన ఘటన..

ఆ  మహిళా జడ్జికి శాశ్వత హోదాపై సిఫారసు ఉపసంహరణ, సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం.
Supreme Court
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2021 | 12:49 PM

బాంబే హైకోర్టు జడ్జి పుష్ప గనెడివాలాకు శాశ్వత హోదా కల్పించాలన్న తన సిఫారసును సుప్రీంకోర్టు కొలీజియం ఉపసంహరించుకుంది. ఇది చాలా అరుదైన ఘటన.. లైంగిక దాడులు, నేరాలపై గత కొన్ని రోజులుగా జస్టిస్ పుష్ప వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధమైన కేసుల్లో ఒక  జడ్జికి శాశ్వత హోదా కల్పించాలన్న నిర్ణయం ఆయనకు లేదా ఆమెకు మరింత శిక్షణ అవసరమన్న ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థాన వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఈ జడ్జిపై  వ్యక్తిగతంగా  కోర్టుకు  వ్యతిరేక అభిప్రాయమేదీ లేదని, కానీ ఆమె లాయర్ గా ఉన్నప్పుడు ఇలాంటి కేసులను డీల్ చేసి ఉండకపోవచ్చునని. ఆమెకు ఇంకా శ్జిక్షణ అవసరమని ఈ వర్గాలు వివరించాయి. జడ్జీలకు శాశ్వత హోదా కల్పించడం, ఈ విషయంలో కొలీజియం తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపడం పరిపాటి.. ఒక్కోసారి కొన్ని కొర్రీలతో ఈ విధమైన సిఫారసులు తిరిగి కొలీజియానికి చేరుతాయి.

పుష్ప గనెడివాలా ను బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ కి శాశ్వత జడ్జిగా ధృవీకరిస్తూ ఈ నెల 20 న సుప్రీంకోర్టు కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే లైంగిక నేరాలపై ఆమె ఈ మధ్య రెండు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ ఛాతీని నిమరడం, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకపోవడం పోక్సో చట్టం కింద నేరం కాదని ఆమె మొదట రూలింగ్ ఇఛ్చారు. ఆ  మరుసటి రోజే… బాధితురాలి చేతులను తాకుతూనో, లేదా ప్యాంట్ జిప్ విప్పడమో వంటివి కూడా ఈ చట్టం కింద  అఫెన్స్ కాదని మరో తీర్పు ఇస్తూ.. 5 ఏళ్ళ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని నిర్దోషిగా విడిచిపుచ్చారు.. కానీ ఈ తీర్పులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. చివరకు ఈ తీర్పులకు గాను ఆ మహిళా జడ్జికి సంబంధించి తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియం వెనక్కి తీసుకుంది.