‘తలా’ రిటైర్మెంట్ వద్దు..ట్విట్టర్‌లో ఫ్యాన్స్ వినూత్న ప్రచారం

|

Jul 14, 2019 | 7:11 AM

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ నేమ్ గురించి సపరేట్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం. భారత క్రికెట్ చరిత్రలో అతనిది చెరపలేని, చెరిగిపోని ప్రస్థానం. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఏ కెప్టెన్‌కు కూడా సాధ్యం కాని రీతిలో ఐసీసీ ట్రోఫీలన్నీ నెగ్గిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 2004 డిసెంబర్ 23న టీమిండియా తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహీ.. అనతి కాలంలోనే గొప్ప క్రికెటర్‌గా అంతకు మించి గొప్ప నాయకుడిగా ఎదిగాడు. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్‌పై […]

తలా రిటైర్మెంట్ వద్దు..ట్విట్టర్‌లో ఫ్యాన్స్ వినూత్న ప్రచారం
Follow us on

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ నేమ్ గురించి సపరేట్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం. భారత క్రికెట్ చరిత్రలో అతనిది చెరపలేని, చెరిగిపోని ప్రస్థానం. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఏ కెప్టెన్‌కు కూడా సాధ్యం కాని రీతిలో ఐసీసీ ట్రోఫీలన్నీ నెగ్గిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. 2004 డిసెంబర్ 23న టీమిండియా తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహీ.. అనతి కాలంలోనే గొప్ప క్రికెటర్‌గా అంతకు మించి గొప్ప నాయకుడిగా ఎదిగాడు.

ప్రస్తుతం ధోని రిటైర్మెంట్‌పై తీవ్రమైన చర్చ నడుస్తోంది. సొంత గడ్డ మీదకు తిరిగొచ్చాక… మిస్టర్ కూల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని వార్తలొస్తున్నాయి. కానీ ధోని ఫ్యాన్స్‌తో పాటు మరికొందరు దేశీ, విదేశీ మాజీ ఆటగాళ్లు సైతం మహీ ఇంకొంతకాలం భారత్ క్రికెట్ టీంకు సేవలు అందించగలడని చెప్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ధోని పేరు ప్రతిరోజు ట్రెండ్ అవుతోంది. మహీ అభిమానులు ఐదు భాషల్లో ఓ హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేసి ధోనికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.

భారతదేశం మొత్తం నీకు అండగా ఉందన్నట్టుగా.. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మళయాళం భాషల్లో #ನಾವುमोहब्बतதலధోనిഎന്നേക്കും అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ನಾವು = We (కన్నడ), मोहब्बत = Love, தல = Thala (Tamil), ధోనీ എന്നേക്കും = Forever (Malayalam)…. వియ్ లవ్ తల ధోనీ ఫరెవర్ అని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.