‘విరాట్ కోహ్లీ మనిషి కాదు… పరుగుల మెషీన్’: బ్రియాన్ లారా

| Edited By: Srinu

May 25, 2019 | 6:19 PM

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనిషి కాదు.. పరుగుల మెషీన్ అని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తెలిపారు. ఇంగ్లండ్ వేదికగా ఈ నెల 30 నుండి ఐసీసీ ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టుగా భారత్ బరిలోకి దిగుతోంది. పలువురు దిగ్గజ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ ఉంది. ముఖ్యంగా పరుగుల వీరుడు కోహ్లీ ఉన్నాడు కాబట్టి భారత జట్టే ఫేవరెట్ అంటున్నారు. […]

విరాట్ కోహ్లీ మనిషి కాదు... పరుగుల మెషీన్: బ్రియాన్ లారా
Follow us on

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనిషి కాదు.. పరుగుల మెషీన్ అని వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా తెలిపారు. ఇంగ్లండ్ వేదికగా ఈ నెల 30 నుండి ఐసీసీ ప్రపంచకప్‌ సమరం ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టుగా భారత్ బరిలోకి దిగుతోంది. పలువురు దిగ్గజ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు బ్యాటింగ్, బౌలింగ్ ఉంది. ముఖ్యంగా పరుగుల వీరుడు కోహ్లీ ఉన్నాడు కాబట్టి భారత జట్టే ఫేవరెట్ అంటున్నారు.

తాజాగా బ్రియాన్ లారా కూడా విరాట్ కోహ్లీపై స్పందించాడు. ‘అతను ఓ పరుగుల మెషీన్. 80-90లో కంటే కోహ్లీ ప్రత్యేకమైన ఆటగాడు. ప్రస్తుతం నిరంతరం క్రికెట్ ఆడుతున్న కారణంగా ఫిట్ నెస్ చాలా అవసరం. కోహ్లీ ఇందులో ముందున్నాడు. మైదానంలోకి వచ్చిన ప్రతిసారి పరుగులు చేస్తున్నాడు. సచిన్ ఎప్పటికీ గొప్ప బ్యాట్స్‌మన్‌. సచిన్, కోహ్లీలను పోల్చలేను. కానీ.. కోహ్లీకి ప్రత్యేక టాలెంట్ ఉంది. అతను రాబోయే క్రికెటర్లకు ఆదర్శంగా నిలుస్తాడు’ అని లారా పేర్కొన్నారు.

‘ఒకవేళ బుమ్రాను నేను ఎదుర్కొవాల్సి వస్తే.. స్ట్రైక్ రాకుండా చూసుకుంటాను. లేదా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనిపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తా. అని లారా బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు.