Paris Olympics 2024: క్రీడాకారుల అంకితభవానికి దేశం సెల్యూట్ చేస్తోంది: కేంద్ర మంత్రి సింధియా

|

Aug 08, 2024 | 9:38 PM

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. కాగా రెండో క్వార్టర్‌ ఆరంభంలో స్పెయిన్‌ ఆటగాడు మార్క్‌ మిరల్లెస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో స్పెయిన్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు...

Paris Olympics 2024: క్రీడాకారుల అంకితభవానికి దేశం సెల్యూట్ చేస్తోంది: కేంద్ర మంత్రి సింధియా
Paris Olympics 2024
Follow us on

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు సత్తా చాటింది. కాంస్య పతకాన్ని దక్కిచుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో 2-1తో స్పెయిన్‌పై గెలుపొందింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ అద్భుత ఆటతీరును కనబరించారు. రెండు గోల్స్‌చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయలేకపోయాయి. కాగా రెండో క్వార్టర్‌ ఆరంభంలో స్పెయిన్‌ ఆటగాడు మార్క్‌ మిరల్లెస్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో స్పెయిన్‌ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక 29వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ లభించింది. హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలిచేందుకు ప్రయత్నించినా స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకున్నాడు.

వెంటనే మరో పెనాల్టీ కార్నర్‌ లభించగా భారత్‌ సద్వినియోగం చేసుకుంది. ఈ సారి హర్మన్‌ప్రీత్‌ ఎలాంటి పొరపాటు చేయకుండా బంతి గోల్‌ పోస్ట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు.60వ నిమిషంలో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్‌ రాగా.. సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్ 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీరకు ముగింపు పలికిన శ్రీజేశ్‌ భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్‌ పోస్టు ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ సింగ్ అతడిని తన భుజాలపై ఎత్తుకుని మైదానమంతా కలియ తిరిగాడు. ఇతర ఆటగాళ్లు కూడా శ్రీజేశ్‌ను అభినందించారు.

ఇదిలా ఉంటే భారత్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టును ప్రశంసిస్తూ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్‌ చేశారు. భారత హాకీ జట్టుకు హృదయపూర్వక అభినందనలతో పాటు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, క్రీడాకారుల అంకితభావానికి, కృషికి, నిబద్ధతకు దేశం సెల్యూట్ చేస్తుంది అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..