బాల్ తగిలి..అంపైర్ దుర్మరణం

|

Aug 16, 2019 | 3:30 PM

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ పొందుతోన్న ఆట. ఈ గేమ్ ఎంత వినోదాన్ని ఇస్తుందో..కొన్నిఅనుకోని సంఘటనలు అంతే విషాదాన్ని మిగులుస్తాయి.  నెలరోజుల క్రితం లండన్​లో జరిగిన కౌంటీ మ్యాచ్​లో బంతి తగిలి ఆసుపత్రిలో చేరాడు అంపైర్ జాన్ విలియమ్స్​. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మరణించాడు. జులై 13న పెమ్​బ్రోక్​ – నార్​బెత్​ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అంపైర్​ మరణించిన విషయాన్ని పెమ్​బ్రోక్​షైర్​ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ మ్యాచ్​లో అంపైర్​ […]

బాల్ తగిలి..అంపైర్ దుర్మరణం
Cricket Umpire dies
Follow us on

క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ పొందుతోన్న ఆట. ఈ గేమ్ ఎంత వినోదాన్ని ఇస్తుందో..కొన్నిఅనుకోని సంఘటనలు అంతే విషాదాన్ని మిగులుస్తాయి.  నెలరోజుల క్రితం లండన్​లో జరిగిన కౌంటీ మ్యాచ్​లో బంతి తగిలి ఆసుపత్రిలో చేరాడు అంపైర్ జాన్ విలియమ్స్​. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మరణించాడు. జులై 13న పెమ్​బ్రోక్​ – నార్​బెత్​ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అంపైర్​ మరణించిన విషయాన్ని పెమ్​బ్రోక్​షైర్​ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ మ్యాచ్​లో అంపైర్​ జాన్​ తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స​కోసం హావర్​ఫోర్డ్​వెస్ట్​లోని మరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Cricket Umpire Died