ప్రపంచ కప్‌కు నేడే జట్టు ఎంపిక

|

Apr 15, 2019 | 8:04 AM

వరల్డ్ కప్…ఈ మాట వింటే చాలు సగటు క్రికెట్ అభిమాని ఆనందం అంతా..ఇంతా కాదు. ఈ మెగా టోర్నీకి టైం దగ్గర పడుతుంది. అన్ని దేశాలు తమ జట్లను సన్నద్దం చేసే పనిలో ఉన్నాయి. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ఆతృతగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇక వరల్డ్‌ కప్‌లో భారత్ తరపున బరిలోకి దిగనున్న 15 మంది జట్టు సభ్యుల ఎంపిక ఇవాళే జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని 5గురు […]

ప్రపంచ కప్‌కు నేడే జట్టు ఎంపిక
Follow us on

వరల్డ్ కప్…ఈ మాట వింటే చాలు సగటు క్రికెట్ అభిమాని ఆనందం అంతా..ఇంతా కాదు. ఈ మెగా టోర్నీకి టైం దగ్గర పడుతుంది. అన్ని దేశాలు తమ జట్లను సన్నద్దం చేసే పనిలో ఉన్నాయి. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌ వేదికగా ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ఆతృతగా క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఇక వరల్డ్‌ కప్‌లో భారత్ తరపున బరిలోకి దిగనున్న 15 మంది జట్టు సభ్యుల ఎంపిక ఇవాళే జరగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని 5గురు సభ్యులతో కూడిన భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ఈరోజు ముంబైలో సమావేశమై టీమిండియాను ఎంపిక చేయనుంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు కోచ్‌ రవిశాస్త్రి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంతకు ముందే ప్రపంచకప్‌ జట్టు ఖరారైనట్టుగా భావించినా.. టీమిండియా ఆడిన చివరి రెండు మూడు సిరీస్‌ల్లో కొందరు ఆటగాళ్ల ప్రదర్శనలో నిలకడ లేకపోవడంతో మళ్లీ సందిగ్ధత నెలకొంది. 4 స్థానంలో ఆడే ఆటగాడు, స్పేర్ వికెట్ కీపర్‌‌పై సెలక్షన్ కమిటీ తర్జన, భర్జనలు పడుతుంది. యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి.