‘మన్కడింగ్ ఔట్’ అంటే ఏంటి..!

| Edited By:

Mar 26, 2019 | 12:37 PM

సోమవారం రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్‌ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ఔట్ చేశాడు. దీంతో ఈ పదంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విధంగా ఔట్ జరగడం ఇది మొదటిదేం కాదు. గతంలో కపిల్ శర్మ, గేల్ వంటి క్రీడాకారులు మన్కడింగ్ ఔట్ ద్వారా బ్యాట్స్‌మన్‌లను ఔట్ చేశారు. ‘మన్కడింగ్ ఔట్’ వెనుక కథ 1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో భారత దిగ్గజ బౌలర్ వినూ […]

‘మన్కడింగ్ ఔట్’ అంటే ఏంటి..!
Follow us on

సోమవారం రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్‌ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జోస్ బట్లర్‌ను రవిచంద్రన్ అశ్విన్ మన్కడింగ్ ఔట్ చేశాడు. దీంతో ఈ పదంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ విధంగా ఔట్ జరగడం ఇది మొదటిదేం కాదు. గతంలో కపిల్ శర్మ, గేల్ వంటి క్రీడాకారులు మన్కడింగ్ ఔట్ ద్వారా బ్యాట్స్‌మన్‌లను ఔట్ చేశారు.

‘మన్కడింగ్ ఔట్’ వెనుక కథ
1947-48 ఆస్ట్రేలియా పర్యటనలో భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే బంతి వేయకముందే క్రీజు వదిలి పరుగుకు ప్రయత్నించాడు. దీంతో పలుమార్లు అతడిని వారించాడు మన్కడ్. దీంతో బ్రౌన్ క్రీజు దాటిన తరువాత మన్కడ్ అతడిని రనౌట్ చేయడంతో అతడిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఈ పర్యటనలో మరోసారి బ్రౌన్‌ను మన్కడ్‌ను ఔట్ చేశాడు. అప్పటి నుంచి ఆయన పేరు మీద మన్కడింగ్ ఔట్‌గా పిలుస్తున్నారు.

అయితే తొలుత నిబంధన 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు మాత్రమే అతడిని అవుట్ చేసే అవకాశం కలిగేది. కానీ ఎంసీసీ(మెరిలిన్ క్రికెట్ క్లబ్) బౌలర్లకు అనుకూలంగా ఈ నిబంధనను 41.16గా మార్చేసింది. సవరించిన నిబంధన ప్రకారం బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. అయితే ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిబంధనను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఈ మన్కడింగ్‌ పదాన్నే పూర్తిగా తొలిగించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏసీసీకి సూచించారు. క్రీడాస్ఫూర్తిగా విరుద్ధమైన రనౌట్‌గా పరిగణించే ఈ ప్రక్రియకు భారత క్రికెట్ దిగ్గజం పేరును కొనసాగించడాన్ని ఆయన తప్పుబట్టారు. అంతగా అవసరమైతే తొలిసారిగా ఔటైన బిల్ బౌన్ పేరు మీదుగా బౌన్డ్ అని పిలువాలంటూ ఆయన పేర్కొన్నారు.