“ధోనీ విలువ అప్పుడే తెలిసింది”

|

Jul 03, 2020 | 4:38 PM

2007 నుంచి భార‌త్ త‌రుఫున‌ ఆడుతున్నా కానీ.. 2013 తర్వాతే ధోనీ గొప్ప‌త‌నం అర్థం చేసుకున్నానని బౌలర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. యంగ్ ప్లేయ‌ర్స్ తో మ‌హీ వ్యవహరించే తీరుకు తాను ఫిదా అయ్యాన‌ని తెలిపాడు.

ధోనీ విలువ అప్పుడే తెలిసింది
Follow us on

2007 నుంచి భార‌త్ త‌రుఫున‌ ఆడుతున్నా కానీ.. 2013 తర్వాతే ధోనీ గొప్ప‌త‌నం అర్థం చేసుకున్నానని బౌలర్ ఇషాంత్ శర్మ తెలిపాడు. యంగ్ ప్లేయ‌ర్స్ తో మ‌హీ వ్యవహరించే తీరుకు తాను ఫిదా అయ్యాన‌ని తెలిపాడు. ఎప్పుడు కావాలంటే అతడి గ‌దికి వెళ్లేవాళ్ల‌మ‌ని వివ‌రించాడు. ఈ విష‌యం ష‌మీకి కూడా తెలిస‌న్న ఇషాంత్.. ధోనీతో మాట్లాడితే క్రికెట్​తో పాటే బ‌య‌ట ప్ర‌పంచానికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకోవచ్చని చెప్పాడు.

ఇషాంత్.. భార‌త్ తరఫున ధోనీ కెప్టెన్సీలోనే ఎక్కువగా ఆడాడు. 2016లో చివరి వన్డే, 2013లో చివరి ఇంట‌ర్నేష‌న‌ల్ టీ20 మ్యాచ్​లో పాల్గొన్నాడు. అయితే ఇండియా టెస్టు టీములో రెగ్యులర్ సభ్యుడిగా ఇప్పటివరకు రాణిస్తున్నాడు.​ 97 టెస్టులు, 80 వన్డేలు, 14 టీ20లు ఆడిన ఇషాంత్.. మొత్తంగా 420 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు.