డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన క్రికెటర్‌

| Edited By: Anil kumar poka

Apr 05, 2019 | 1:27 PM

కొలొంబో: శ్రీలంక టెస్టు  క్రికెట్‌ కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయాడు.  ఆదివారం తెల్లవారుజామున  కొలొంబోలో కారు నడిపి.. ఓ ట్రాలీని ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనం డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కరుణరత్నెను  అరెస్టు చేసిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఆయనను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ  కేసు వల్ల అతడి కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వార్తను ధృవీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఏ చర్య తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నట్లు […]

డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన క్రికెటర్‌
Follow us on

కొలొంబో: శ్రీలంక టెస్టు  క్రికెట్‌ కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నె డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయాడు.  ఆదివారం తెల్లవారుజామున  కొలొంబోలో కారు నడిపి.. ఓ ట్రాలీని ఢీకొట్టాడు. దీంతో ఆ వాహనం డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కరుణరత్నెను  అరెస్టు చేసిన పోలీసులు అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఆయనను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈ  కేసు వల్ల అతడి కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వార్తను ధృవీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. ఏ చర్య తీసుకోవాలన్నదానిపై చర్చిస్తున్నట్లు తెలిపింది.

కరుణరత్నె అందించిన విజయాల కారణంగా అతనికి వన్డే కెప్టెన్‌గా సేవలందించే విషయంపై బోర్డు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ఇలాంటి సమయంలో కరుణరత్నె చేసిన స్వయం తప్పిదం అతన్ని వెంటాడనుంది.   కరుణరత్నె ఇప్పటివరకు 60 టెస్టు మ్యాచులు ఆడి మొత్తం 4,074 పరుగులు సాధించాడు. అందులో 8 శతకాలు, 22 అర్ధశతకాలు ఉన్నాయి.