సుప్రీంకోర్టులో క్రికెటర్ శ్రీశాంత్‌కు ఊరట

| Edited By:

Mar 15, 2019 | 2:22 PM

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ శ్రీశాంత్‌కు కాస్త ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే తనకు అసలు ఏ శిక్షా విధించవద్దన్న శ్రీశాంత్ అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. అతనిపై జీవితకాల నిషేధం కాకుండా మరేదైనా శిక్ష విధించాలని, దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగాను శ్రీశాంత్ జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శిక్షపై […]

సుప్రీంకోర్టులో క్రికెటర్ శ్రీశాంత్‌కు ఊరట
Follow us on

న్యూఢిల్లీ: టీమిండియా పేస్ బౌలర్ శ్రీశాంత్‌కు కాస్త ఊరట కలిగించే తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. అతనిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాలని బీసీసీఐని ఆదేశించింది. అయితే తనకు అసలు ఏ శిక్షా విధించవద్దన్న శ్రీశాంత్ అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. అతనిపై జీవితకాల నిషేధం కాకుండా మరేదైనా శిక్ష విధించాలని, దీనిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 2013 ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకుగాను శ్రీశాంత్ జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. శిక్షపై అతని వాదన కూడా కమిటీ వినాలని అశోక్ భూషణ్, కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

శ్రీశాంత్‌ తరఫు న్యాయవాది సల్మాన్‌ ఖుర్షిద్‌ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. కచ్చితమైన ఆధారాలు లేకుండా బీసీసీఐ.. శ్రీశాంత్‌పై నిషేధం విధించడం దారుణమన్నారు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని.. ఒక ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఆ ఓవర్‌లో శ్రీశాంత్‌ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అసలు శ్రీశాంత్ మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడలేదు. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు కూడా లేవు. కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించడం సరికాదు అని ఆయన కోర్టుకు విన్నవించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీసీసీఐ శ్రీశాంత్‌ను జీవితకాలం నిషేధించడం సరికాదని ఖుర్షీద్‌ వివరించారు. ఇదిలా ఉండగా 2018 ఆగస్టులో కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చిందని అయినా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఖుర్షీద్‌ తెలిపారు. కాగా బీసీసీఐ నిషేధం ఎత్తేస్తే శ్రీశాంత్‌ తిరిగి క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆయన కోర్టుకు వివరించారు.