ఫ్రెంచ్‌ ఓపెన్‌: మూడో రౌండ్ లోకి సెరెనా, జొకోవిచ్

| Edited By:

May 31, 2019 | 6:39 PM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అలవోకగా గెలుపొంది మూడోరౌండ్‌కు దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంప్‌ సిమోనా హలెప్‌ కష్టపడి నెగ్గగా.. తొలి రౌండ్‌లో చెమటోడ్చిన టాప్‌సీడ్‌ నవోమి ఒసాకా రెండో రౌండ్‌లోనూ ఓటమిని తప్పించుకొని ఊపిరి పీల్చుకుంది. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన ఒసాకా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో […]

ఫ్రెంచ్‌ ఓపెన్‌: మూడో రౌండ్ లోకి సెరెనా, జొకోవిచ్
Follow us on

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెరెనా విలియమ్స్‌ జోరు కొనసాగుతోంది. ఈ మాజీ చాంపియన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అలవోకగా గెలుపొంది మూడోరౌండ్‌కు దూసుకెళ్లింది. మరోవైపు డిఫెండింగ్‌ చాంప్‌ సిమోనా హలెప్‌ కష్టపడి నెగ్గగా.. తొలి రౌండ్‌లో చెమటోడ్చిన టాప్‌సీడ్‌ నవోమి ఒసాకా రెండో రౌండ్‌లోనూ ఓటమిని తప్పించుకొని ఊపిరి పీల్చుకుంది. పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన ఒసాకా గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్‌లో పోరాడి నెగ్గింది. తొలి సెట్‌ను కోల్పోయిన జపాన్‌ స్టార్‌ రెండో సెట్‌లో 2-4తో వెనుకబడిన సమయంలో అద్భుతంగా పుంజుకుని 4-6, 7-5, 6-3తో ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకాను ఓడించింది. ఈ క్రమంలో రోలాండ్‌ గారోస్ లో లిండ్సే డావెన్‌పోర్ట్‌ (2005) తర్వాత తొలి రెండు మ్యాచ్‌ల్లో మొదటి సెట్‌లు కోల్పోయి అద్భుత విజయాలను అందుకున్న రెండో క్రీడాకారిణిగా ఒసాకా రికార్డులకెక్కింది.