దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. రెండో రోజు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన రోహిత్.. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట 71 ఏళ్లుగా పదిలంగా ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేశాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్లో అత్యధిక సగటు కలిగిన క్రికెటర్‌గా బ్రాడ్‌మన్ (98.22 సగటుతో) ఉండగా, తాజాగా ఈ రికార్డును రోహిత్ అధిగమించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ స్వదేశంలో ఆడిన గత పది టెస్టుల్లో సగటు 99.84. ఏ ఆటగాడైనా గత పది ఇన్నింగ్స్‌ల్లో సాధించిన సగటును పరిగణలోనికి తీసుకొని ఈ రికార్డును ప్రకటిస్తారు.
రోహిత్ ఈ మ్యాచ్‌లో మరో కొన్ని రికార్డులు సైతం తన పేరిట లిఖించుకున్నాడు. విండీస్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హిట్మైర్ ఓ టెస్టు సిరీస్‌లో సాధించిన అత్యధిక సిక్సుల రికార్డును సైతం బద్దలు కొట్టాడు. హిట్మైర్ బంగ్లాతో జరిగిన సిరీస్‌లో 15 సిక్సులు బాదగా, రోహిత్ 16 సిక్సులతో ఈ రికార్డును తుడిచిపెట్టాడు. ఓ టెస్టు సిరీస్‌లో రెండు అంతకన్నా ఎక్కువ సెంచరీలు బాదిన రెండో ఓపెనర్ గా రోహిత్ రికార్డు పుటాల్లోకెక్కాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ మూడు సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు.
Rohit Sharma breaks Don Bradman's 71-year-old record
Read @ANI Story | https://t.co/D8BzbL4Urg pic.twitter.com/MT18NUMJo3
— ANI Digital (@ani_digital) October 20, 2019