భారత జట్టులో నాలుగో స్థానం అతడిదేనా?

| Edited By:

Apr 11, 2019 | 9:31 PM

వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచకప్‌లో ఆడే భారతజట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించనున్న నేపథ్యంలో నాలుగో స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెలక్టర్లు కూడా ఈ స్థానంపై మల్లగుల్లాలు పడుతుండగా.. ముంబై-పంజాబ్ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ వారికో దారి చూపించినట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయిన పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు సెలక్టర్ల దృష్టి రాహుల్‌పై పడింది. నాలుగో స్థానానికి అతడు సరిగ్గా సరిపోతాడని సెలక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగో […]

భారత జట్టులో నాలుగో స్థానం అతడిదేనా?
Follow us on

వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచకప్‌లో ఆడే భారతజట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించనున్న నేపథ్యంలో నాలుగో స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సెలక్టర్లు కూడా ఈ స్థానంపై మల్లగుల్లాలు పడుతుండగా.. ముంబై-పంజాబ్ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ వారికో దారి చూపించినట్టు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయిన పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు.

దీంతో ఇప్పుడు సెలక్టర్ల దృష్టి రాహుల్‌పై పడింది. నాలుగో స్థానానికి అతడు సరిగ్గా సరిపోతాడని సెలక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. నాలుగో స్థానానికి అతడే సరైన వ్యక్తి అని అభిమానులు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రాహుల్ 6 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టి ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేశాడు.