PKL 2024: దేవాంక్‌, అయాన్‌ సూపర్‌ టెన్‌ షో.. దబంగ్‌ ఢిల్లీపై పట్నా పైరేట్స్‌ గెలుపు

|

Nov 01, 2024 | 6:27 PM

Pro Kabaddi League 2024: ప్రొ కబడ్డీ సీజన్ 11లో గత మ్యాచ్‌ ఓటమి నుంచి మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ పుంజుకుంది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11 మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై 14 పాయింట్ల భారీ తేడాతో పట్నా పైరేట్స్‌ విజయం సాధించింది. రెయిడర్లు దేవాంక్‌ (12 పాయింట్లు), అయాన్‌ (12 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో మెరువడంతో పట్నా పైరేట్స్‌ తిరుగులేని ప్రదర్శన చేసింది.

PKL 2024: దేవాంక్‌, అయాన్‌ సూపర్‌ టెన్‌ షో.. దబంగ్‌ ఢిల్లీపై పట్నా పైరేట్స్‌ గెలుపు
Patna Pirates Thrashes Dabang Delhi
Follow us on

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్ 11లో గత మ్యాచ్‌ ఓటమి నుంచి మూడు సార్లు చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ పుంజుకుంది. గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11 మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీపై 14 పాయింట్ల భారీ తేడాతో పట్నా పైరేట్స్‌ విజయం సాధించింది. రెయిడర్లు దేవాంక్‌ (12 పాయింట్లు), అయాన్‌ (12 పాయింట్లు) సూపర్‌ టెన్‌ షోతో మెరువడంతో పట్నా పైరేట్స్‌ తిరుగులేని ప్రదర్శన చేసింది. 44-30తో దబంగ్ ఢిల్లీపై పట్నా పైరేట్స్ గెలుపొంది. ఈ సీజన్లలో రెండో విజయాన్ని పట్నా పైరేట్స్ తన ఖాతాలో వేసుకుంది. దబంగ్‌ ఢిల్లీ ఆటగాళ్లలో ఆషు మాలిక్‌ (10 పాయింట్లు), వినయ్‌ విరేందర్‌ (10 పాయింట్లు) సైతం సూపర్‌ టెన్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

పట్నా పైరేట్స్‌ జోరు :

దబంగ్ ఢిల్లీ కెసిపై పట్నా పైరేట్స్‌ దూకుడు చూపించింది. తొలి 20 నిమిషాల ఆటలోనే 8 పాయింట్ల ఆధిక్యం సాధించింది. దబంగ్ ఢిల్లీ రెయిడర్లలో ఆషు మాలిక్‌, వినయ్‌ వీరేందర్‌ మెరిసినా.. డిఫెన్స్‌లో పట్నా పైరేట్స్‌ పైచేయి సాధించింది. రెయిడర్లు అయాన్‌, దేవాంక్‌ నిలకడగా కూతకెళ్లి పాయింట్లు తీసుకొచ్చారు. దీంతో 10 నిమిషాల్లోనే పట్నా పైరేట్స్‌ 11-8తో మూడు పాయింట్ల ముందంజలో నిలిచింది. రెయిడర్లు, డిఫెండర్లు మెరువటంతో దబంగ్‌ ఢిల్లీని ఆలౌట్‌ చేసిన పైరేట్స్‌ విలువైన పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రెయిడింగ్‌లో పోటీనిచ్చినా.. డిఫెన్స్‌లో దబంగ్‌ ఢిల్లీ పూర్తిగా తేలిపోయింది. ఫలితంగా పట్నా పైరేట్స్‌ 21-13తో ప్రథమార్థంలో అదరగొట్టింది.

దబంగ్‌ పోరాడినా.. :

ఆట ద్వితీయార్థంలో దబంగ్‌ ఢిల్లీ కెసి పోరాడినా ఫలితం లేకపోయింది. విరామ సమయం ముగియగానే దూకుడు పెంచిన దబంగ్‌ ఢిల్లీ కూతలో, పట్టులో మెరిసి పట్నా పైరేట్స్‌ను ఆలౌట్‌ చేసింది. అయినా, పట్నా పైరేట్స్‌ ముందంజలోనే కొనసాగించింది. ఆలౌట్‌ నుంచి పుంజుకున్న పట్నా పైరేట్స్‌ నిమిషాల వ్యవధిలోనే దబంగ్ ఢిల్లీ కోర్టు ఖాళీ చేసింది. ఆరు నిమిషాల ఆట మిగిలి ఉండగానే పట్నా పైరేట్స్‌ 40-27తో తిరుగులేని ముందంజ వేసింది. ఆఖర్లోనూ అదే జోరు కొనసాగించిన పట్నా పైరేట్స్‌ సీజన్లలో రెండో విజయం నమోదు చేసింది.