ప్రొ కబడ్డీ లీగ్‌ విజేత బెంగాల్‌..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

|

Oct 20, 2019 | 2:56 AM

తుదిపోరులో దబాంగ్‌ ఢిల్లీని మట్టికరిపించి ప్రొ కబడ్డీ టైటిల్‌ను బెంగాల్ వారియర్స్‌ తొలిసారిగా ముద్దాడింది. తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్‌ ఢిల్లీదే టైటిల్‌ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌ సీజన్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న దబంగ్‌ ఢిల్లీకి షాక్‌ ఇస్తూ విజయకేతనం ఎగరవేసింది. ఢిల్లీ రైడర్‌ నవీన్‌ కుమార్‌ 18 పాయింట్లతో విజయం కోసం విశ్వ ప్రయత్నం చేసినా.. బెంగాల్‌ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.  ఫలితంగా అహ్మదాబాద్‌ […]

ప్రొ కబడ్డీ లీగ్‌ విజేత బెంగాల్‌..ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
Follow us on

తుదిపోరులో దబాంగ్‌ ఢిల్లీని మట్టికరిపించి ప్రొ కబడ్డీ టైటిల్‌ను బెంగాల్ వారియర్స్‌ తొలిసారిగా ముద్దాడింది. తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్‌ ఢిల్లీదే టైటిల్‌ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్‌ వారియర్స్‌ సీజన్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న దబంగ్‌ ఢిల్లీకి షాక్‌ ఇస్తూ విజయకేతనం ఎగరవేసింది. ఢిల్లీ రైడర్‌ నవీన్‌ కుమార్‌ 18 పాయింట్లతో విజయం కోసం విశ్వ ప్రయత్నం చేసినా.. బెంగాల్‌ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.  ఫలితంగా అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఏడో సీజన్ పీకేఎల్‌ ఫైనల్లో ఢిల్లీని బెంగాల్‌ 39-34 తేడాతో ఓడించింది.

మొదలైన ఎనిమిది నిమిషాల్లోపే బెంగాల్ వారియర్స్‌ ఆలౌటైంది. తర్వాత బెంగాల్ అద్భుతంగా పుంజుకొని విరామ సమయానికి 17-17తో స్కోరుని సమం చేసింది. రెండో అర్ధభాగంలోనూ బెంగాల్ తన పరంపర కొనసాగించింది. 13 నిమిషాల్లోపు రెండు సార్లు ఢిల్లీని ఆలౌట్‌ చేసింది. అనంతరం ఢిల్లీ కొద్దిసేపు ప్రతిఘటించినా లాభం లేకపోయింది. ఆఖర్లో ఢిల్లీ  రైడర్ నవీన్ కుమార్ పోరాడి 32-37తో జట్టును తిరిగి పోటీలోకి తీసుకువచ్చాడు. చివరికి 39-34 తేడాతో ఢిల్లీని ఓడించి బెంగాల్ వారియర్స్‌ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 18 పాయింట్లు సాధించిన నవీన్‌ కుమార్‌ 300 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు. విజేత బెంగాల్‌ వారియర్స్‌ జట్టుకు రూ. 3 కోట్లు… రన్నరప్‌ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి.