ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌‌కు గాయం

ప్రపంచకప్‌ ముందు హాట్ పేవరెట్ ఇంగ్లాండ్‌ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ గాయం బారిన పడ్డాడు. శుక్రవారం ఉదయం ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి చేతివేలికి గాయమైందని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు శనివారం ఆస్ట్రేలియాతో ఆ జట్టు వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఇతర టీం మేట్స్‌తో కలిసి సౌథాంప్టన్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా క్యాచులు పట్టాడు. ఈ క్రమంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి […]

ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌‌కు గాయం
Follow us

|

Updated on: May 24, 2019 | 7:04 PM

ప్రపంచకప్‌ ముందు హాట్ పేవరెట్ ఇంగ్లాండ్‌ కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌ గాయం బారిన పడ్డాడు. శుక్రవారం ఉదయం ప్రాక్టీస్‌ చేస్తుండగా అతడి చేతివేలికి గాయమైందని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. మెగా టోర్నీ ఆరంభానికి ముందు శనివారం ఆస్ట్రేలియాతో ఆ జట్టు వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఇతర టీం మేట్స్‌తో కలిసి సౌథాంప్టన్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా క్యాచులు పట్టాడు. ఈ క్రమంలో అతడి ఎడమ చేతి చూపుడు వేలికి గాయమైందని, ప్రాక్టీస్‌ అనంతరం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది

ముందస్తు చర్యల్లో భాగంగా చేతివేలికి ఎక్స్‌రే తీయిస్తున్నామని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా మోర్గాన్‌ కెప్టెన్సీలో వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో నిలిచిన ఆ జట్టు ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌ జట్టుగా మారింది. అయితే బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ఆ జట్టులో మోర్గాన్‌ కీలక ఆటగాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ మే 30న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ ఆడనుంది.