భారత ఆటగాళ్లను కాస్త బయట లీగ్స్‌కు పంపించండి: పాక్ క్రికెట్ బోర్డ్

| Edited By: Srinu

Mar 06, 2019 | 9:07 PM

ముంబయి: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్‌) గురువారం ప్రారంభమైంది. అయితే పీఎస్‌ఎల్‌ ప్రారంభమైన మూడేళ్లకే ఎంతో ప్రాచుర్యం సంపాదించింది. ఐపీఎల్‌ మినహాయించి విదేశాల్లో జరిగే ఏ టీ20 లీగుల్లో టీమిండియా ఆటగాళ్లు ఆడటం లేదు. దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఛైర్మన్‌ ఇసాన్‌ మనీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లను విదేశీ లీగుల్లో భాగం చేయాలంటూ బీసీసీఐని కోరారు. ‘బీసీసీఐ అమలు చేసే కొన్ని విధానాలు ఎంతో బాగుంటాయి. కానీ, విదేశాల లీగుల్లో టీమిండియా […]

భారత ఆటగాళ్లను కాస్త బయట లీగ్స్‌కు పంపించండి: పాక్ క్రికెట్ బోర్డ్
Follow us on

ముంబయి: దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా పాకిస్థాన్‌ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్‌) గురువారం ప్రారంభమైంది. అయితే పీఎస్‌ఎల్‌ ప్రారంభమైన మూడేళ్లకే ఎంతో ప్రాచుర్యం సంపాదించింది. ఐపీఎల్‌ మినహాయించి విదేశాల్లో జరిగే ఏ టీ20 లీగుల్లో టీమిండియా ఆటగాళ్లు ఆడటం లేదు. దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఛైర్మన్‌ ఇసాన్‌ మనీ స్పందించారు. టీమిండియా ఆటగాళ్లను విదేశీ లీగుల్లో భాగం చేయాలంటూ బీసీసీఐని కోరారు.

‘బీసీసీఐ అమలు చేసే కొన్ని విధానాలు ఎంతో బాగుంటాయి. కానీ, విదేశాల లీగుల్లో టీమిండియా ఆటగాళ్లను ఆడించడం లేదు. ఈ విధానంలో మార్పులు రావాలి. విదేశాలకు చెందిన ఎందరో ఆటగాళ్లు భారత్‌కు వచ్చి ఆడుతున్నారు. అలాగే టీమిండియా ఆటగాళ్లు కూడా అన్ని దేశాలకు వెళ్తే బాగుంటుంది’ అని తెలిపారు.

ఐపీఎల్‌లో ఒకప్పుడు పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా ఆడేవారు. అయితే ఇండియా-పాకిస్థాన్‌ దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో కొంత కాలంగా వారిని ఐపీఎల్‌లో ఆడించడం లేదు. దీంతో 2016లో పీసీబీ పాకిస్థాన్‌లో పీఎస్‌ఎల్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ పీఎస్‌ఎల్‌ మ్యాచులన్నీ దుబాయ్‌లో జరుగుతున్నాయి. కానీ వచ్చే ఏడాది నుంచి అన్ని మ్యాచులనూ పాకిస్థాన్‌లోనే నిర్వహించే విధంగా పాకిస్థాన్‌ బోర్డు సన్నాహాలు చేస్తోంది.