Vinesh Phogat: వినేష్ ఫోగట్ అనర్హతపై హీటెక్కిన భారత్.. నెగిటివ్ ప్రచారం సరికాదంటోన్న నిపుణులు

|

Aug 07, 2024 | 4:01 PM

Paris Olympics 2024: దేశం మొత్తం బంగారు పతకం కోసం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమె ఫైనల్ మ్యాచ్‌కు ముందే అనర్హురాలిగా మారింది. మంగళవారం, వినేష్ ఫోగాట్ సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్‌మాన్‌ను 5-0తో ఓడించి చరిత్ర సృష్టించింది.

Vinesh Phogat: వినేష్ ఫోగట్ అనర్హతపై హీటెక్కిన భారత్.. నెగిటివ్ ప్రచారం సరికాదంటోన్న నిపుణులు
Vinesh Phogat Health
Follow us on

Paris Olympics 2024: దేశం మొత్తం బంగారు పతకం కోసం ఎదురుచూస్తోంది. ఇదే సమయంలో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమె ఫైనల్ మ్యాచ్‌కు ముందే అనర్హురాలిగా మారింది. మంగళవారం, వినేష్ ఫోగాట్ సెమీ-ఫైనల్స్‌లో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్‌మాన్‌ను 5-0తో ఓడించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఒలింపిక్ ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి మహిళా రెజ్లర్‌గా నిలిచింది. వినేష్ ఫోగట్ విజయం సాధించినందుకు దేశం మొత్తం అభినందనలు తెలుపుతోంది. అయితే, ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు.

ఈ వార్త బయటకు రావడంతో ఒకవైపు అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ స్టార్ల నుంచి నిపుణులు, తోటి ఆటగాళ్లు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో, వినేష్ ఫోగట్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, మరోవైపు ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం కుట్ర చేశారంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో 2008లో భారత టార్చ్ బేరర్‌గా నిలిచిన దిగ్విజయ్ సింగ్ ఓ పోస్ట్ చేశారు. ‘వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం అందరినీ చాలా నిరాశపరిచింది. ఆశ్చర్యపరుస్తుంది. కానీ, ఈ దురదృష్టకర పరిణామం చుట్టూ జరుగుతున్న చర్చలు ఏ స్థాయికి పడిపోయాయో చూపిస్తుంది. ప్రధానిపై ద్వేషంతో రాజకీయ రాబందులు వినేష్‌పై కుట్ర అని చెబుతూ రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. క్రీడల గురించి ఏమీ తెలియని రాజకీయ నాయకులే ఇలాంటి పిచ్చి స్టేట్‌మెంట్లు చేస్తున్నారు. ఇవి జాతీయ మీడియాలో రావడం విచారకరం. ఈ సమయంలో, బాధ్యతాయుతమైన మీడియా ఈ ఊహాగానాలపై కాకుండా వాస్తవాలపై దృష్టి పెట్టాలి. బాధ్యతాయుతమైన మీడియా సంయమనం పాటించి, అసలు ప్రక్రియ ఏమిటో నిపుణుల అభిప్రాయాలతో ప్రసారం చేయాలి’ అంటూ ట్వీట్ చేశారు.

అలాగే, RevSportz వ్యవస్థాపకుడు బోరియా మజుందార్ ట్వీట్ చేస్తూ.. ఇది ఉద్దేశపూర్వకంగానే చేశారంటూ చాలా ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కాదు. డాక్టర్ పార్దివాలా, మొత్తం సపోర్ట్ టీమ్ ఆమె కోసం రాత్రంతా పనిచేసింది. సీడీఎంగా గగన్‌ ఈ అంశంపై స్పందించారు. IOA ఎంతగానో మద్దతును అందించింది. వారంతా మానవీయంగా చేయగలిగినదంతా చేశారు. దయచేసి మనం తెలివిగా ప్రవర్తించాలి. కుట్ర చేశారంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. ఇది ఆమె బాధను మరింత పెంచుతుందని’ అన్నారు.

మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..