Vinesh Phogat: సెమీస్ తర్వాత చిన్న తప్పిదం.. అకస్మాత్తుగా బరువు పెరిగిన వినేష్ ఫోగట్.. అసలేం జరిగిందంటే?

|

Aug 07, 2024 | 4:54 PM

Vinesh Phogat Weight Increase Reason: అయితే సెమీ-ఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆమె బరువును కొలిచారు. ఆ సమయంలో వినేష్ ఫోగట్ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు తేలింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తొలి మ్యాచ్‌కు ముందు వినేష్ బరువు 50 కేజీలలోపు ఉండగా.. సెమీఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆమె బరువు 52 కేజీలు దాటింది. ప్రశ్న ఏమిటంటే, వినేష్ ఫోగట్ బరువు కొన్ని గంటల్లో ఎలా పెరిగింది?

Vinesh Phogat: సెమీస్ తర్వాత చిన్న తప్పిదం.. అకస్మాత్తుగా బరువు పెరిగిన వినేష్ ఫోగట్.. అసలేం జరిగిందంటే?
Vinesh Phogat Weight
Follow us on

Vinesh Phogat Weight Increase Reason: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడంతో భారత అభిమానులకు పెద్ద షాక్ తగిలింది. వినేష్ ఫోగట్ 50 కిలోల మహిళల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే సెమీ-ఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆమె బరువును కొలిచారు. ఆ సమయంలో వినేష్ ఫోగట్ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ బరువు ఉన్నట్లు తేలింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తొలి మ్యాచ్‌కు ముందు వినేష్ బరువు 50 కేజీలలోపు ఉండగా.. సెమీఫైనల్‌లో గెలిచిన తర్వాత ఆమె బరువు 52 కేజీలు దాటింది. ప్రశ్న ఏమిటంటే, వినేష్ ఫోగట్ బరువు కొన్ని గంటల్లో ఎలా పెరిగింది? ఒకే ఒక్క తప్పిదంతో ఆమె బరువులో ఈ మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వినేష్ ఫోగట్ బరువు ఎలా పెరిగిందంటే..

మంగళవారం ఉదయం వినేష్ ఫోగట్ బరువు తూకం వేసినప్పుడు 49 కిలోల 900 గ్రాములుగా ఉంది. అయితే, అసలు ఆమె సాధారణ బరువు గురించి మాట్లాడితే 57 కిలోలుగా ఉంది. యాభై కిలోల బరువు తగ్గేందుకు ఆమె చాలా కష్టపడింది. కానీ, ఈ బరువును కాపాడుకోవడం చాలా కష్టమైన పనిగా మారింది. నివేదికల ప్రకారం, వినేష్ ఫోగట్ సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత చాలా తక్కువ ఆహారం తీసుకుంది. దీంతో ఆమె బరువు అకస్మాత్తుగా పెరిగిందంట. వినేష్ బరువు 52.7 కిలోలకు చేరుకుందని చెబుతున్నారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, వినేష్ ఫోగట్ వరుసగా మూడు బౌట్‌లు ఆడిన తర్వాత చాలా బలహీనంగా భావించిందంట. ఈ కారణంగా ఆమె భోజనంతోపాటు ఎక్కువగా నీళ్లు తీసుకుందంట. దీంతో అకస్మాత్తుగా ఆమె బరువు పెరగడంతో ఇబ్బందిగా మారింది.

వినేష్ ఫోగట్ ఎంత ప్రయత్నించినా..

బరువు తగ్గేందుకు వినేష్ ఫోగట్ చాలా ప్రయత్నించిందంట. పారిస్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం, ఆమె గంటలపాటు స్టీమింగ్ రూంలో కూర్చుందంట. రన్నింగ్, స్కిప్పింగ్‌తో పాటు సైక్లింగ్ కూడా చేసిందంట. అలాగే, వినేష్ తన జుట్టు, గోళ్లను కూడా కత్తిరించిందంట. అలాగే రక్తాన్ని కూడా కొద్దిగా తీసింది. అయినప్పటికీ ఆమె బరువు 50 కిలోల 100 గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒలింపిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం, ఒక బాక్సర్ తన కేటగిరీ కంటే 100 గ్రాముల బరువును మాత్రమే ఎక్కువగా కలిగి ఉండాలి. కానీ, వినేష్ తన బరువును నియంత్రించుకోలేకపోయింది. ఫలితంగా ఆమె ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..