Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ దూకుడు.. సెమీఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్..

|

Aug 06, 2024 | 4:38 PM

Paris Olympics 2024: మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ 7-5తో ఉక్రెయిన్‌కు చెందిన మూడుసార్లు CWG బంగారు పతక విజేత ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. వినేష్‌కి ఇది తొలి ఒలింపిక్‌ సెమీఫైనల్‌. అంతకుముందు వినేష్ 3-2తో జపాన్‌కు చెందిన యుయి సుసాకిని మట్టికరిపించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. జపాన్ రెజ్లర్ టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్. టోక్యో గేమ్స్‌లో ఒక్క […]

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ దూకుడు.. సెమీఫైనల్‌కు చేరిన భారత రెజ్లర్..
Vinesh Phogat 1
Follow us on

Paris Olympics 2024: మంగళవారం జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ 7-5తో ఉక్రెయిన్‌కు చెందిన మూడుసార్లు CWG బంగారు పతక విజేత ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. వినేష్‌కి ఇది తొలి ఒలింపిక్‌ సెమీఫైనల్‌.

అంతకుముందు వినేష్ 3-2తో జపాన్‌కు చెందిన యుయి సుసాకిని మట్టికరిపించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. జపాన్ రెజ్లర్ టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్. టోక్యో గేమ్స్‌లో ఒక్క పాయింట్ కూడా వదలివేయకుండా స్వర్ణం సాధించింది.

ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా వినేష్ మహిళల 50 కేజీల విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కోటాను లాక్ చేసింది. ఆమె సెమీఫైనల్‌లో లారా గనికిజీని ఓడించింది.

సెమీస్ చేరిన వినేష్..

వినేష్ రియో ​​2016, టోక్యో 2020 రెండింటిలోనూ క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్క్రమించింది. రియో ​​2016లో ఆమె తన మ్యాచ్‌లో గాయంతో బాధపడుడూ తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె మూడు ఒలింపిక్ గేమ్స్ ప్రదర్శనలతో తొలి భారత మహిళా రెజ్లర్‌గా.. అత్యధిక ఒలింపిక్ క్రీడలలో కనిపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..