TV9 Football Talent Hunt: ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. ‘ఇండియన్ టైగర్స్ & ఇండియన్ టైగ్రెస్స్’ టాలెంట్ హంట్ వచ్చేసింది..

|

Apr 10, 2024 | 12:08 PM

News9’s Indian Tigers & Indian Tigresses: న్యూస్9 ఆధ్వర్యంలో భారతదేశంలోనే అతిపెద్ద టాలెంట్ హంట్ జరగనుంది. 14 ఏళ్లలోపు ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం వేట మొదలైంది. నేడు నోయిడా వేదికగా ‘ఇండియన్ టైగర్స్ & ఇండియన్ టైగ్రెస్స్’ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ గ్రాండ్‌గా మొదలుకాబోతుంది. యూరోపియన్

TV9 Football Talent Hunt: ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్.. ‘ఇండియన్ టైగర్స్ & ఇండియన్ టైగ్రెస్స్’ టాలెంట్ హంట్ వచ్చేసింది..
News9 Talent Hunt
Follow us on

News9’s Indian Tigers & Indian Tigresses: న్యూస్9 ఆధ్వర్యంలో భారతదేశంలోనే అతిపెద్ద టాలెంట్ హంట్ జరగనుంది. 14 ఏళ్లలోపు ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం వేట మొదలైంది. నేడు నోయిడా వేదికగా ‘ఇండియన్ టైగర్స్ & ఇండియన్ టైగ్రెస్స్’ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ గ్రాండ్‌గా మొదలుకాబోతుంది. యూరోపియన్ ఫుట్‌బాల్ స్టాల్వార్ట్స్ భాగస్వామ్యంతో టీవీ9 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ టాలెంట్ హంట్‌తో భారతీయ ఫుట్‌బాల్‌ను మార్చడం, యువ ప్రతిభకు పట్టం కట్టాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు.

ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తోంది టీవీ9. న్యూస్‌ 9 ప్లస్‌ ఇండియన్‌ టైగర్‌ & టైగ్రిస్‌ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ నోయిడాలో 1300 మంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అండర్‌ 14 కేటగిరీలో ప్రతిభావంతుల కోసం అన్వేషణ సాగుతోంది. విద్యార్థులను ఉద్దేశించి TV9 నెట్‌వర్క్‌ ఎండీ బరుణ్‌ దాస్‌ ప్రసంగించనున్నారు. జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌కు చెందిన ఫుట్‌బాల్‌ సమాఖ్యల ప్రతినిధులు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. దేశంలో ఫుట్‌బాల్‌ క్రీడకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోలో తెలుసుకోండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..