తెలంగాణ బిడ్డ.. ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ విజయం సాధించింది. ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్‌పై ఘన విజయం సాధించింది. హైదరాబాద్‌లోని ఏవీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సమయంలో జలంధర్‌లో జరిగిన ఆలిండియా యూనివర్సిటీస్ పోటీల్లో ఆమె బెస్ట్ బాక్సర్ ఛాంపియన్ షిప్ సాధించింది. విశాఖపట్నంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బాక్సింగ్ శిక్షణ తీసుకుంది. నిఖత్ ప్రముఖ బాక్సర్ మేరీకోమ్‌ను స్పూర్తిగా తీసుకొని బాక్సింగ్‌లో దూసుకుపోతోంది.
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ..
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిఖత్ జరీన్ దూకుడుగా ఆడుతోంది.
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. థాయ్‌లాండ్‌కు చెందిన బాక్సర్తో నిఖత్ జరీన్ తలపడుతోంది.
నిఖత్ జరీన్ మరికొన్ని క్షణాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జుటమస్ జిట్పంగ్తో ఫైనల్ ఆడనుంది.