Prasanta Dora Passes Away : భారత సాకర్ మాజీ​ గోల్​కీపర్ ప్రశాంత్​ డోరా కన్నుమూత..

|

Jan 26, 2021 | 9:59 PM

భారత సాకర్ మాజీ​ గోల్​కీపర్ ప్రశాంత్​ డోరా కన్నుమూశాడు. హిమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH​) అనే అత్యంత అరుదైన వ్యాధితో డోరా బాధపడుతున్నాడు.

Prasanta Dora Passes Away : భారత సాకర్ మాజీ​ గోల్​కీపర్ ప్రశాంత్​ డోరా కన్నుమూత..
Follow us on

Goalkeeper prasanta dora : భారత సాకర్ మాజీ​ గోల్​కీపర్ ప్రశాంత్​ డోరా కన్నుమూశాడు. హిమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ (HLH​) అనే అత్యంత అరుదైన వ్యాధితో డోరా బాధపడుతున్నాడు. డిసెంబర్​ 28 నుంచి కోల్​కతాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  44ఏళ్ల ప్రశాంత్‌ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. ఈ వివరాలను కోల్​కతా స్పోర్ట్స్​ క్లబ్​ మోహన్​ బగాన్​ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పేర్కొంది.

మాజీ గోల్​కీపర్‌ మోహన్​ బగాన్​ అథ్లెటిక్స్​ ఆటగాడు ప్రశాంత్​ డోరా అకాల మరణంతో శోక సంద్రంలో మునిగిపోయినట్లుగా తెలిపింది. 2001, 2003-05లో మోహన్​ బగాన్​లో అతడు సభ్యుడిగా ఉన్నాడు. 2003 ఐఎఫ్​ఏ షీల్డ్​ గెలుపొందడంలో ప్రశాంత్​ కీలక పాత్ర పోషించాడు అని కోల్​కతా మోహన్​ బగాన్​ పేర్కొంది.

డోరా తన కెరీర్​లో.. టోలీగంగే అగ్రగామి, కోల్​కతా పోర్ట్ ట్రస్ట్, మహమ్మదీన్​ స్పోర్టింగ్​, మోహన్​ బగాన్​, తూర్పు బంగాల్​ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. సంతోష్​ ట్రోఫీని వరుసగా బంగాల్​ జట్టు గెలిచినప్పుడు అతడు ఆ జట్టులో గోల్​కీపర్​గా ఆడాడు. ఎస్​ఏఎఫ్​ఎఫ్​ కప్​, ఎస్​ఏఎఫ్​ గేమ్స్​ల్లోనూ భారత జట్టుకు ఆడాడు.