”టీమిండియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు” ఆసీస్ కోచ్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jan 19, 2021 | 9:19 PM

Justin Langer Comments: ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది.

టీమిండియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు ఆసీస్ కోచ్ లాంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Follow us on

Justin Langer Comments: ఆసీస్ గడ్డపై టీమిండియా చరిత్ర తిరగరాసింది. 33 ఏళ్లుగా ఓటమెరగని గబ్బా మైదానంలో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఫలితంగా 2-1తో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంపై పలువురు మాజీ క్రికెటర్లు టీమిండియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ టీమిండియా విజయంపై చేసిన పలు ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

”ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. భారత బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు అద్భుతం. ఈ టెస్టు సిరీస్ నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. టీమిండియాను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. 1.5 బిలియన్ల భారతీయులతో బలమున్న టీమిండియాను ఎన్నడూ తక్కువ అంచనా వేయకండి. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీలో యువ క్రికెటర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే కాకుండా స్పూర్తిదాయకంగా ఆడారు. మరోసారి టెస్టు క్రికెట్ విలువేంటో కనిపించింది” అని జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. కాగా, ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘పాపం లాంగర్.. ఓడిపోయినా తర్వాతైనా అసలు విషయాన్ని గ్రహించాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.