బాక్సింగ్‌లో భారత్‌కు పసిడి పంట

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారంతో ముగిసిన ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది. టోర్నీలో భారత బాక్సర్లు రాణించడంతో భారత్‌కు పసిడి పంట పండింది. ఎనిమిది విభాగాల్లో భారత్‌కు స్వర్ణం దక్కగా.. మేరీ కోమ్ 51కేజీల విభాగంలో పసిడి సొంతం చేసుకుంది. ఫైనల్లో జరిగిన బౌట్‌లో భారత్‌కు చెందిన వన్‌లాల్ డ్యుయాటీని 5-0తేడాతో చిత్తుగా ఓడించింది. మేరీ కోమ్‌తో పాటు సరితా దేవీ(60 కేజీలు), జమునా బొరొ(54 […]

బాక్సింగ్‌లో భారత్‌కు పసిడి పంట
Follow us

| Edited By:

Updated on: May 25, 2019 | 7:47 PM

ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. శుక్రవారంతో ముగిసిన ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణాన్ని దక్కించుకుంది. టోర్నీలో భారత బాక్సర్లు రాణించడంతో భారత్‌కు పసిడి పంట పండింది.

ఎనిమిది విభాగాల్లో భారత్‌కు స్వర్ణం దక్కగా.. మేరీ కోమ్ 51కేజీల విభాగంలో పసిడి సొంతం చేసుకుంది. ఫైనల్లో జరిగిన బౌట్‌లో భారత్‌కు చెందిన వన్‌లాల్ డ్యుయాటీని 5-0తేడాతో చిత్తుగా ఓడించింది. మేరీ కోమ్‌తో పాటు సరితా దేవీ(60 కేజీలు), జమునా బొరొ(54 కేజీలు), నీరజ(57 కేజీలు) స్వర్ణం కైవసం చేసుకున్నారు. టోర్నీలో భారత్ 12 స్వర్ణాలు దక్కాయి.