కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన కోచ్‌గా మెక్‌కల్లమ్

| Edited By:

Aug 16, 2019 | 2:52 AM

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొత్త ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నియమితులయ్యారు. ఇంతకు ముందు ఉన్న జాక్వస్‌ కల్లిస్‌ స్థానాన్ని మెక్‌కల్లమ్ భర్తీ చేయనున్నాడు. 2020 ఐపీఎల్‌ సీజన్‌లో కొత్త కోచ్‌ నేతృత్వంలో నైట్‌రైడర్స్‌ బరిలోకి దిగనుంది. మొదటి నుంచీ ఈ జట్టుతో కల్లమ్‌కు అనుబంధం ఉంది. 2008 నుంచి 2010 వరకు కల్లమ్ నైట్‌రైడర్స్‌ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2012-13 సీజన్‌లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2012 […]

కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రధాన కోచ్‌గా మెక్‌కల్లమ్
Follow us on

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కొత్త ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ నియమితులయ్యారు. ఇంతకు ముందు ఉన్న జాక్వస్‌ కల్లిస్‌ స్థానాన్ని మెక్‌కల్లమ్ భర్తీ చేయనున్నాడు. 2020 ఐపీఎల్‌ సీజన్‌లో కొత్త కోచ్‌ నేతృత్వంలో నైట్‌రైడర్స్‌ బరిలోకి దిగనుంది. మొదటి నుంచీ ఈ జట్టుతో కల్లమ్‌కు అనుబంధం ఉంది. 2008 నుంచి 2010 వరకు కల్లమ్ నైట్‌రైడర్స్‌ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2012-13 సీజన్‌లో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2012 విజేతగా నిలిచిన కోల్‌కతా జట్టులో మెక్‌కల్లమ్‌ కీలకపాత్ర పోషించాడు. ఈ సందర్భంగా మెక్‌ కల్లమ్‌ మాట్లాడుతూ.. తనకు ఈ బాధ్యతలు అప్పగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్‌, సీపీఎల్‌ ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు విశిష్ఠ స్థానం ఉందన్నాడు.