రగ్బీ ఆటలో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు

| Edited By: Pardhasaradhi Peri

Jun 24, 2019 | 5:51 PM

రగ్బీ ఆటలో భారత మహిళల జట్టు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అండర్-15 అంతర్జాతీయ రగ్బీ పోటీల్లో తొలిసారి భారత జట్టు విజయం సాధించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో శనివారం జరిగిన ఆసియా రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో 21-19 తేడాతో టాప్ ర్యాంకర్‌ సింగపూర్‌పై మహిళల టీమ్ విజయ బావుటా ఎగరవేసింది. దీంతో ఈ టోర్నీలో కాంస్య పతకం అందుకున్న మహిళల జట్టు.. తొలి అంతర్జాతీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో చైనా […]

రగ్బీ ఆటలో చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు
Follow us on

రగ్బీ ఆటలో భారత మహిళల జట్టు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అండర్-15 అంతర్జాతీయ రగ్బీ పోటీల్లో తొలిసారి భారత జట్టు విజయం సాధించింది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో శనివారం జరిగిన ఆసియా రగ్బీ మహిళల ఛాంపియన్‌షిప్ డివిజన్-1లో 21-19 తేడాతో టాప్ ర్యాంకర్‌ సింగపూర్‌పై మహిళల టీమ్ విజయ బావుటా ఎగరవేసింది. దీంతో ఈ టోర్నీలో కాంస్య పతకం అందుకున్న మహిళల జట్టు.. తొలి అంతర్జాతీయ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో చైనా విజేతగా నిలిచింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ఫిలిప్పీన్స్‌తో తలపడిన చైనా 68-0 స్కోరుతో ఆ జట్టును చిత్తుగా ఓడించింది.