నాలుగో మ్యాచ్ కూడా టై…సూపర్ ఓవర్‌లో భారత్ విజయం

|

Jan 31, 2020 | 10:09 PM

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లగా కెఎల్ రాహుల్, కోహ్లి బరిలోకి దిగారు. టిమ్ సౌథీ బౌలింగ్ వేశాడు. రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్ అండ్ ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక […]

నాలుగో మ్యాచ్ కూడా టై...సూపర్ ఓవర్‌లో భారత్ విజయం
Follow us on

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టీ20లో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్లగా కెఎల్ రాహుల్, కోహ్లి బరిలోకి దిగారు. టిమ్ సౌథీ బౌలింగ్ వేశాడు. రాహుల్ తొలి రెండు బంతులను సిక్స్ అండ్ ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక మిగిలిన పనిని భారత సారథి పూర్తి చేశాడు. నాలుగవ బంతికి రెండు పరుగులు తీసిన కోహ్లీ, 5 బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు.

సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 13 పరుగులే చేయగలిగింది. భారత ఏస్ బౌలర్ బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మొదటి బంతికి.. సీఫెర్ట్  2 పరుగులు తీయగా..రెండో బంతికి ఫోర్ బాదాడు.  మూడో బంతి మళ్లీ 2 పరుగులు తీసిన సీఫెర్ట్ ..నాలుగో బంతికి ఔటయ్యాడు. ఈ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన మున్రో ఐదో బంతిని బౌండరీకి తరలించి నాలుగు పరుగులు రాబట్టాడు. చివరి ఆరో బంతిని..ఒక్క పరుగుతో సరిపెట్టాడు.

మ్యాచ్ ఎలా సాగిందంటే..

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 165 రన్స్ చేసింది. మనీష్ పాండే హాఫ్ సెంచరీతో నిలకడగా ఆడాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్స్‌లో మున్రో, సీఫెర్ట్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. లాస్ట్ 2 ఓవర్స్‌లో న్యూజిలాండ్ విజయానికి  11 రన్స్ కావాల్సి ఉండగా..అత్యంత టైట్‌గా బౌలింగ్ వేసిన సైనీ 19వ ఓవర్​లో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ వేసిన శార్దుల్ కూడా సూపర్‌గా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఇక సూపర్ ఓవర్‌లో యధావిదిగానే న్యూజిలాండ్‌కి ఫేట్ కలిసిరాకపోవడంతో..భారత్ ఈజీగా విజయం సాధించింది.