India Vs Australia 2020: ఆసీస్‌తో సిరీస్: భళా రిషబ్ పంత్.. ధోని రికార్డును బ్రేక్ చేశాడుగా..

|

Jan 19, 2021 | 7:33 PM

India Vs Australia 2020: ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ యువ వికెట్ కీపర్ జీరో నుంచి హీరో అయిపోయాడు. మూడో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌తో...

India Vs Australia 2020: ఆసీస్‌తో సిరీస్: భళా రిషబ్ పంత్.. ధోని రికార్డును బ్రేక్ చేశాడుగా..
పంత్ - 21 పరుగులు.. స్టోక్స్ బౌలింగ్ లో ఔట్
Follow us on

India Vs Australia 2020: ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌తో భారత్ యువ వికెట్ కీపర్ జీరో నుంచి హీరో అయిపోయాడు. మూడో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌తో పాటు ఆఖరి టెస్టు చివరి ఇన్నింగ్స్‌లోనూ వీరోచితంగా బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ క్రమంలోనే పంత్ ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.

టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయడమే కాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ అందుకుని చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 32 ఇన్నింగ్స్‌లో 1000 రన్స్ చేసిన ధోని పేరిట ఉన్న రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. కేవలం 27 ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇక వీరి తర్వాత ఫరూక్ ఇంజినీర్(36), సాహా(37), నయన్ మోంగియా(39) ఆ జాబితాలో ఉన్నారు.

ఇవి చదవండి:

స్టీవ్ స్మిత్‌ను ఆట ఆడుకున్న రోహిత్ శర్మ.. సేమ్ సీన్ రిపీట్.. హిట్‌మ్యాన్ కామెడీ అదుర్స్…

అరుదైన రికార్డు సాధించిన హైదరాబాదీ.. సిరాజ్‌కు సలాం కొడుతోన్న నెటిజన్లు..