2020 ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం

| Edited By:

Mar 16, 2019 | 4:53 PM

వాషింగ్టన్ : భారత ఫుట్‌బాల్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. 2020లో జరగనున్న ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఫిఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో అధికారికంగా ప్రకటించారు. అమెరికాలోని మియామీలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుందన్న విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇన్‌ఫాంటినో అన్నారు. 2017 అండర్-17 మెన్స్ […]

2020 ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం
Follow us on

వాషింగ్టన్ : భారత ఫుట్‌బాల్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్త. 2020లో జరగనున్న ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఫిఫా) అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో అధికారికంగా ప్రకటించారు. అమెరికాలోని మియామీలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుందన్న విషయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఇన్‌ఫాంటినో అన్నారు. 2017 అండర్-17 మెన్స్ వరల్డ్‌కప్ తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న రెండో ఫిఫా టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. ఆల్‌ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సెక్రటరీ కుశాల్ దాస్ మాట్లాడుతూ.. ఉమెన్స్ ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు తమకు ఇచ్చినందుకు ఫిఫాకు ధన్యవాదాలు. భారత్‌లో మహిళల ఫుట్‌బాల్ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంట్ నిర్వహణ ఎంతో ఉపయోగపడుతుందని కుశాల్ అభిప్రాయపడ్డారు.