సత్తా చాటిన భారత షూటర్లు!

| Edited By:

May 31, 2019 | 6:04 PM

ఐఎస్ఎస్ఎఫ్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్లు తమ సత్తా చాటారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో గురువారం జరిగిన చివరిరోజు పోటీల్లో భారత్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో క్లీన్‌స్వీప్‌ చేసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌తో పాటు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత జోడీలు విజేతలుగా నిలిచాయి. అంజుమ్‌ మోద్గిల్‌-దివ్యాంశ్‌సింగ్‌ పన్వర్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణం నెగ్గగా.. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ టైటిల్‌ను […]

సత్తా చాటిన భారత షూటర్లు!
Follow us on

ఐఎస్ఎస్ఎఫ్‌ షూటింగ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్లు తమ సత్తా చాటారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో గురువారం జరిగిన చివరిరోజు పోటీల్లో భారత్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో క్లీన్‌స్వీప్‌ చేసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌తో పాటు 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత జోడీలు విజేతలుగా నిలిచాయి. అంజుమ్‌ మోద్గిల్‌-దివ్యాంశ్‌సింగ్‌ పన్వర్‌ జోడీ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో స్వర్ణం నెగ్గగా.. ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ టైటిల్‌ను యువ జంట మను భాకర్‌-సౌరభ్‌ చౌదరి గెలుచుకుంది. దీంతో ఓవరాల్‌గా ఐదు స్వర్ణాలు, ఓ రజతంతో భారత్‌ అగ్రస్థానంలో నిలిచి టోర్నీని ఘనంగా ముగించింది. రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో చైనా రెండో స్థానంతో సరిపెట్టుకుంది.