ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌: మేరీకోమ్‌‌కు స్వర్ణం

|

May 25, 2019 | 11:24 AM

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలో సత్తాచాటింది. మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మేరీకోమ్‌ 5-0తో వాన్లాల్‌ దువాతి (భారత్‌)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 12 బంగారు పతకాలు దక్కించుకుంది. 54 కేజీలలో జమున బోరో, 57 కేజీలలో నీరజ్‌, 60 కేజీలలో సరిత దేవి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. 48 కేజీలలో మోనిక, 69 కేజీలలో లవ్లీనా […]

ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌: మేరీకోమ్‌‌కు స్వర్ణం
Follow us on

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ ఇండియా ఓపెన్‌ బాక్సింగ్‌ టోర్నీలో సత్తాచాటింది. మహిళల 51 కేజీల విభాగంలో స్వర్ణంతో మెరిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో మేరీకోమ్‌ 5-0తో వాన్లాల్‌ దువాతి (భారత్‌)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్‌ మొత్తం 12 బంగారు పతకాలు దక్కించుకుంది. 54 కేజీలలో జమున బోరో, 57 కేజీలలో నీరజ్‌, 60 కేజీలలో సరిత దేవి స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు. 48 కేజీలలో మోనిక, 69 కేజీలలో లవ్లీనా రజతాలు సాధించారు. పురుషుల 49 కేజీలలో దీపక్‌, 52 కేజీలలో అమిత్‌ ఫంగాల్‌, 69 కేజీలలో ఆశిష్‌, 60 కేజీలలో శివ థాపా నెగ్గి బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు.