ఐదో వన్డేలో భారత్ ఓటమి

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:23 PM

ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఓటమి చవి చూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 273 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 237 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీనితో ఆస్ట్రేలియా 35 పరుగులు తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 3-2 తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (56) తప్ప మిగిలిన […]

ఐదో వన్డేలో భారత్ ఓటమి
Follow us on

ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఓటమి చవి చూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. 273 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ కేవలం 237 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీనితో ఆస్ట్రేలియా 35 పరుగులు తేడాతో విజయం సాధించి.. సిరీస్ ను 3-2 తో కైవసం చేసుకుంది. భారత్ బ్యాట్స్ మెన్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (56) తప్ప మిగిలిన టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అందరూ ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు.  మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (12), కెప్టెన్ కోహ్లీ (20), రిషబ్ పంత్ (16), విజయ్ శంకర్ (16) లు తక్కువ స్కోర్స్ కే పెవిలియన్ కు చేరారు. రవీంద్ర జడేజా (0) డకౌట్ కాగా.. చివర్లో కేదార్ జాదవ్ (44), భువనేశ్వర్ కుమార్ (46)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3 వికెట్స్ పడగొట్టగా, పాట్ కమ్మిన్స్, రిచర్డ్ సన్, స్టయినిస్ లకు రెండేసి వికెట్స్.. లియోన్ కు ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(100), పీటర్ హ్యాండ్స్ కోంబ్(52) పరుగులు చేయగా.. చివర్లో బౌలర్ రిచర్డ్ సన్(29) పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా డీసెంట్ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు తీయగా.. షమీ, జడేజా చెరో రెండేసి వికెట్స్..  కులదీప్ కు ఒక వికెట్ దక్కింది.