Team India Cricketers: ఆ ఐదుగురు క్రికెటర్ల తప్పేం లేదు.. బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు..

|

Jan 04, 2021 | 1:06 PM

Team India Cricketers:ఆసిస్ టూర్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, పృథ్వి షా..

Team India Cricketers: ఆ ఐదుగురు క్రికెటర్ల తప్పేం లేదు.. బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు..
Follow us on

Team India Cricketers:ఆసిస్ టూర్‌లో ఉన్న టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, నవదీప్ సైనీ, పృథ్వి షా ఓ రెస్టారెంట్‌కు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే. బయోబబుల్ దాటి వారు రెస్టారెంట్‌కు వెళ్లడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఆ క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లతో పాటు వారి సహాయక సిబ్బందిని సైతం ఐసోలేషన్‌లో ఉంచారు. దాంతో వారు ఆసిస్‌తో మూడవ టెస్ట్‌లో ఆడుతారా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వారికి కరోనా టెస్టులు నిర్వహించగా, నెగిటివ్ అని తేలింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలాఉంటే.. రెస్టారెంట్ ఘటనలో టీమిండియా క్రికెటర్ల తప్పేం లేదని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పుకొచ్చారు. ‘ముందుగా సదరు క్రికెటర్లు రెస్టారెంట్ బయట నిలబడి ఉన్నారు. ఆ సమయంలో భారీ వర్షం కురవడంతో వారు రెస్టారెంట్‌ లోపలికి వెళ్లారు. అంతే తప్ప మరోటి కాదు. మూడవ టెస్ట్‌కు ముందు టీమిండియా క్రికెటర్లను అయోమయానికి గురి చేయాలనే ప్రయత్నంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు ఆడిన డ్రామాలు ఇవి.’ అంటూ సదరు బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు.

 

Also read:

CM Jagan Warning: విగ్రహాల ధ్వంసంపై సీఎం జగన్ సీరియస్.. వారిని వదలిపెట్టేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్..

Andhra Pradesh Speaker: అయినా చంద్రబాబు మారలేదు.. అలిపిరి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని..