రెండో వన్డేలో లెక్క సరిచేసిన కోహ్లీసేన..

| Edited By:

Dec 18, 2019 | 11:03 PM

విండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించడంతో.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ప్రారంభంలో నిలకడగా ఆడినా.. ఆ తర్వాత టీమిండియా బౌలర్ల దాటికి స్థిరంగా […]

రెండో వన్డేలో లెక్క సరిచేసిన కోహ్లీసేన..
Follow us on

విండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా విశాఖలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమిష్టిగా రాణించడంతో.. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. తొలుత టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. ప్రారంభంలో నిలకడగా ఆడినా.. ఆ తర్వాత టీమిండియా బౌలర్ల దాటికి స్థిరంగా నిలదొక్కుకోలేకపోయారు. శార్ధూల్ ఠాకూర్ వేసిన 11ఓవర్‌లో.. ఎవిన్ లివీస్.. శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే మరో రెండు వికెట్లు కూడా కోల్పోయి కష్టాల్లోపడింది.

ఈ క్రమంలో హోప్, పూరన్‌లు జట్టును ఆదుకున్నారు. వీరి జోడీ నాలుగో వికెట్‌కి 106 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీలు చేసిన ఇద్దరు.. షమీ వేసిన 30వ ఓవర్‌లో 75 పరుగులు చేసిన పూరన్ కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్(0) కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత.. కుల్దీప్ యాదవ్ 33 ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించి.. విండీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. తొలుత 78 పరుగులతో క్రీజ్‌లో నిలదొక్కుకున్న షాయ్ హోప్‌ని పెవిలియన్‌కు పంపిన కుల్దీప్.. ఆ తర్వాత వరుస బంతుల్లో జేసన్ హోల్డర్, అల్జరీ జోసెఫ్‌లను ఔట్‌ చేశాడు. ఈ క్రమంలో కుల్దీప్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో రెండు హ్యాట్రిక్‌లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కీమో పాల్, ఖారీ పైర్రీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. బౌండరీల వర్షం కురిపించారు. వీరిద్దరు.. తొమ్మిదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం వీరి జోడీని జడేజా విడగొట్టాడు. 41 ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పైర్రీ.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 44 ఓవర్‌లో షమీ వేసిన మూడో బంతికి 46 పరుగులు చేసిన పాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సిరీస్‌ను 1-1గా సమం చేసింది. ఇక మూడో వన్డే డిసెంబర్ 18 ఆదివారం రోజున కటక్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే.. వారికే సిరీస్ దక్కే అవకాశం ఉంది.