India Vs Australia 2020: అతనిపై ప్రశంసలు గుప్పించానో అంతే సంగతులు ఇక.. అజింక్యా రహానే కెప్టెన్సీపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Dec 27, 2020 | 5:19 AM

తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌కు సారథ్యం వహించిన టీమిండియా క్రికెట్ అజింక్యా రహానేపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..

India Vs Australia 2020: అతనిపై ప్రశంసలు గుప్పించానో అంతే సంగతులు ఇక.. అజింక్యా రహానే కెప్టెన్సీపై గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us on

India Vs Australia 2020: తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్ మ్యాచ్‌కు సారథ్యం వహించిన టీమిండియా క్రికెట్ అజింక్యా రహానేపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అజింక్యా రహానేని తాను ప్రశంసించానంటే ఇక అంతేసంగతులు అని వ్యాఖ్యానించారు. రహానే కెప్టెన్సీ ఎలా ఉందంటూ గవాస్కర్‌కు ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా స్పందించిన గవాస్కర్.. ‘అంత త్వరగా ఒక నిర్ధారణకు రాలేను. ఒకవేళ రహానే కెప్టెన్సీ అద్భుతం అని నేను ప్రశంసించానే అనుకోండి. ఇక అంతే సంగతులు. ఆ ముంబై ప్లేయర్‌ వెనుక నేను ఉన్నట్లుగా ప్రచారం జరగిపోతది. ఇంకా చాలా ప్రచారలే జరుగుతాయి.’ అని గవాస్కర్ వ్యాఖ్యానించారు.

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌‌లో భారత్‌కు అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసిస్ జట్టును 195 పరులకే ఆలౌట్ చేసింది టీమిండియా. దీంతో రహానె కెప్టెన్సీ అద్భుతం అంటూ టీమిండియా మాజీ ప్లేయర్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అంశాల్లో రహానె నిర్ణయాలు సూపర్ అంటూ కొనియాడారు. ఈనేపథ్యంలోనే గవాస్కర్‌కు అలాంటి ప్రశ్ననే ఎదురవగా.. తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

 

Also read:

ASHOK VS MEESALA GEETHA: మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు షాకిచ్చిన టీడీపీ అధిష్టానం.. సర్క్యూలర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన గీత..

రాజీవ్ కుమార్ దర్యాప్తుకు సహకరించడం లేదు..ఆయన ఇచ్చిన సమాధానాలతో తప్పించుకుంటారని సిబిఐ ఆరోపణ