ఢిల్లీ క్రికెట్ బోర్డు మీటింగ్‌లో కొట్లాట.. బ్యాన్ చేయాలని గంభీర్ డిమాండ్!

|

Dec 30, 2019 | 11:18 AM

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. అధికారులు ఒకరిపై ఒకరు దాడికి దిగి కొట్టుకున్నారు. దీనితో మీటింగ్ రసాభాసగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై స్పందించిన మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ డీడీసీఏ అధికారుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘డీడీసీఏ ఆలౌట్ […]

ఢిల్లీ క్రికెట్ బోర్డు మీటింగ్‌లో కొట్లాట.. బ్యాన్ చేయాలని గంభీర్ డిమాండ్!
Follow us on

ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆదివారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. అధికారులు ఒకరిపై ఒకరు దాడికి దిగి కొట్టుకున్నారు. దీనితో మీటింగ్ రసాభాసగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక దీనిపై స్పందించిన మాజీ ఓపెనర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ డీడీసీఏ అధికారుల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘డీడీసీఏ ఆలౌట్ అయింది. అదీ కూడా ఒక అవమానకరమైన డకౌట్. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ.. సంస్థను అవహేళన చేస్తున్నారు. డీడీసీఏను వెంటనే రద్దు చేసి.. గొడవపడిన వారందరిపైనా జీవితకాల నిషేధించడం విధించాలని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, జైషాలను కోరుతున్నా’ అని పేర్కొన్నారు. 

43 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో డీడీసీఏ అధికారులు ఒకరిపై ఒకరు దాడికి దిగడమే కాకుండా తోసుకోవడం, పిడిగుద్దులు కురిపించుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మీటింగ్‌లో ఆమోదం పొందిన అజెండాను మిగిలిన సభ్యులు అంగీకరించకపోవడంతో ఈ గొడవ మొదలైనట్లు తెలుస్తోంది.