“ధోని లాంటి విధ్వంస‌క‌ర ఫినిష‌ర్ ని నేను చూడ‌లేదు”

| Edited By: Anil kumar poka

May 16, 2020 | 7:09 AM

మ్యాచ్ కు ఫినిషింగ్ ఇవ్వ‌డంలో ఎంఎస్ ధోని రేంజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాలా..? ఆ విష‌యంలో ధోనీ స్టయిలే వేరని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లిసిస్ ప్ర‌శంసించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ధోనీ కెప్టెన్సీలోనే చాలా కాలంగా ఆడుతున్న డుప్లెసిస్.. ధోనీ బ్యాటింగ్ శైలిని తాను బాగా ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. కరోనా వైరస్ సంక్షోభం వ‌ల్ల‌ ఐపీఎల్- 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. ‘‘మైదానంలో ధోనీ చాలా సైలెంట్ గా ఉంటాడు. […]

ధోని లాంటి విధ్వంస‌క‌ర ఫినిష‌ర్ ని నేను చూడ‌లేదు
Follow us on

మ్యాచ్ కు ఫినిషింగ్ ఇవ్వ‌డంలో ఎంఎస్ ధోని రేంజ్ ఏంటో ప్ర‌త్యేకంగా చెప్పాలా..? ఆ విష‌యంలో ధోనీ స్టయిలే వేరని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లిసిస్ ప్ర‌శంసించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ధోనీ కెప్టెన్సీలోనే చాలా కాలంగా ఆడుతున్న డుప్లెసిస్.. ధోనీ బ్యాటింగ్ శైలిని తాను బాగా ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. కరోనా వైరస్ సంక్షోభం వ‌ల్ల‌ ఐపీఎల్- 2020 సీజన్ నిరవధికంగా వాయిదాపడిన విషయం తెలిసిందే.

‘‘మైదానంలో ధోనీ చాలా సైలెంట్ గా ఉంటాడు. అలా ఉంటూ.. మ్యాచ్ ఊహ‌కంద‌ని విధంగా ఫినిష్ చేసే విధ్వంస‌క‌ర ఆట‌గాడ‌ని నేను చూడలేదు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌ నుంచి ధోనీ బ్యాటింగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తాను. మ్యాచ్ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఓ ప్లానింగ్ ప్రకారం అతని ఆట సాగుతుంది. ఎవరి బౌలింగ్‌‌ని టార్గెట్ చేయాలి..? అనే విష‌యంపై ధోనీకి పూర్తి క్లారిటీ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ధోనీ స్టయిల్‌లో ఎవ‌రైనా ఆడాలనుకున్నా.. ఫెయిలైపోతారు’’ అని డుప్లెసిస్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఐపీఎల్‌లో ఫ‌స్ట్ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ని లీడ్ చేస్తోన్న‌ ధోనీ.. చెన్నైకి ఏకంగా మూడు ఐపీఎల్ టైటిల్స్‌ని అందించాడు. ఆ టీమ్ ఆడిన ప్రతి సీజన్‌లోనూ జట్టుని కనీసం ప్లేఆఫ్‌కి చేర్చాడు. టోర్నీలోనే విజయవంతమైన కెప్టెన్‌గా త‌లైవా ధోని కొనసాగుతున్నాడు.