
తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ RCB రిటెన్షన్ లీస్టు విడుదల చేసింది. మినీ వేలానికి ముందు, ఈ ఫ్రాంచైజీ జట్టు 7 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. IPL లాగా WPLలో మెగా వేలం లేదు. బదులుగా మినీ వేలం ఉంటుంది. ఆ విధంగా ఫ్రాంచైజీలు గరిష్ట సంఖ్యలో ఆటగాళ్లను నిలుపుకుంటాయి. జట్టు నుండి చాలా తక్కువ మంది ఆటగాళ్లను తొలగిస్తాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీకి 18 మంది మహిళా ఆటగాళ్లను జట్టులో ఉంచుకోవడానికి అనుమతి ఉంది. అందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఇలా కొద్ది రోజుల క్రితమే ట్రేడింగ్ ద్వారా డానీ వాట్ను కొనుగోలు చేసిన ఆర్సీబీ జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య 8కి చేరుకుంది. అందుకే, RCB జట్టు నుండి ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ నాడిన్ డి క్లెర్క్లను విడుదల చేసింది.
దిశా కసత్, ఇంద్రాణి రాయ్, నాడిన్ డి క్లర్క్, శుభా సతీష్, శ్రద్ధా పోకర్కర్, సిమ్రాన్ బహదూర్, హీథర్ నైట్
కోహ్లీకి పదేళ్ల క్రితం ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్ ప్రపోజ్ చేసిన విషయం మనందరీకి తెలిసిందే. ఇటివలే జట్టులోకి ఆర్సీబీ ఆమెను తీసుకుంది.