ఇది నాకు మంచి రీ ఎంట్రీ

|

Jun 02, 2019 | 11:07 AM

బ్రిస్టల్‌: వరల్డ్ కప్‌లో ఆసిస్ శుభారంభం చేసింది. డేవిడ్‌ వార్నర్‌(89; 114 బంతుల్లో 8×4), ఆరోన్‌ఫించ్‌(66; 49 బంతుల్లో 6×4, 4×6) అర్ధశతకాలతో చెలరేగడంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న డేవిడ్‌ వార్నర్‌కిది ఘనమైన ఆరంభమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ సందర్భంగా వార్నర్‌ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. […]

ఇది నాకు మంచి రీ ఎంట్రీ
Follow us on

బ్రిస్టల్‌: వరల్డ్ కప్‌లో ఆసిస్ శుభారంభం చేసింది. డేవిడ్‌ వార్నర్‌(89; 114 బంతుల్లో 8×4), ఆరోన్‌ఫించ్‌(66; 49 బంతుల్లో 6×4, 4×6) అర్ధశతకాలతో చెలరేగడంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న డేవిడ్‌ వార్నర్‌కిది ఘనమైన ఆరంభమనే చెప్పాలి. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ సందర్భంగా వార్నర్‌ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ప్రపంచ కప్‌లోకి ఘన విజయంతో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందని వార్నర్ పేర్కొన్నాడు. అందులో తన పాత్ర కూడా ఉండటం ఇంకా సంతోషాన్నిస్తోందని… ఇది తనకు మంచి రీ ఎంట్రీగా భావిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం ఈ ప్రపంచకప్‌ తనకి చాలా అవసరమని..  ఫామ్‌ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అన్నాడు. ప్రపంచ కప్‌లో ఇక ముందు కూడా ఆసీస్‌ ఇదే దూకుడు కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.