Women’s T20 World Cup 2026 : మహిళా టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు.. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ గడ్డపై రణరంగం

Women's T20 World Cup 2026 : ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి జూలై 5 వరకు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది.

Womens T20 World Cup 2026 : మహిళా టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు.. జూన్ 12 నుంచి ఇంగ్లండ్ గడ్డపై రణరంగం
Women's T20 World Cup 2026

Updated on: Feb 24, 2026 | 4:05 PM

Women’s T20 World Cup 2026 : ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 12 నుంచి జూలై 5 వరకు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఈసారి మొత్తం 12 జట్లు ప్రపంచకప్ వేటలో తలపడుతున్నాయి. గ్రూప్ దశలో జట్లను రెండు విభాగాలుగా విడగొట్టారు. గ్రూప్-1లో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ఉండగా.. గ్రూప్-2లో ఆతిథ్య ఇంగ్లండ్‌తో పాటు వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్ , స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి.

భారత మహిళా జట్టు తన తొలి పోరును చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జూన్ 14న ప్రారంభించనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ రసవత్తర పోరు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత టీమిండియా జూన్ 17న నెదర్లాండ్స్‌తో, జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. గ్రూప్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. జూన్ 28న లార్డ్స్ మైదానంలో పటిష్టమైన ఆస్ట్రేలియాతో భారత్ ఢీకొంటుంది. సెమీఫైనల్స్ జూన్ 30, జూలై 2 తేదీల్లో ది ఓవల్ మైదానంలో జరగనుండగా, గ్రాండ్ ఫైనల్ జూలై 5న చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు.

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్:

జూన్ 12: ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక (ఎడ్జ్‌బాస్టన్)

జూన్ 13: స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)

జూన్ 13: ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (ఓల్డ్ ట్రాఫోర్డ్)

జూన్ 13: వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్ (హాంప్‌షైర్ బౌల్)

జూన్ 14: బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ (ఎడ్జ్‌బాస్టన్)

జూన్ 14: భారత్ వర్సెస్ పాకిస్థాన్ (ఎడ్జ్‌బాస్టన్)

జూన్ 16: న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక (హాంప్‌షైర్ బౌల్)

జూన్ 16: ఇంగ్లండ్ వర్సెస్ ఐర్లాండ్ (హాంప్‌షైర్ బౌల్)

జూన్ 17: ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (హెడింగ్లీ)

జూన్ 17: భారత్ వర్సెస్ నెదర్లాండ్స్ (హెడింగ్లీ)

జూన్ 17: సౌతాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్ (ఎడ్జ్‌బాస్టన్)

జూన్ 18: వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్ (హెడింగ్లీ)

జూన్ 19: న్యూజిలాండ్ వర్సెస్ ఐర్లాండ్ (హాంప్‌షైర్ బౌల్)

జూన్ 20: ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (హాంప్‌షైర్ బౌల్)

జూన్ 20: పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (హాంప్‌షైర్ బౌల్)

జూన్ 20: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్ (హెడింగ్లీ)

జూన్ 21: వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (బ్రిస్టల్)

జూన్ 21: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)

జూన్ 23: న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ (బ్రిస్టల్)

జూన్ 23: శ్రీలంక వర్సెస్ ఐర్లాండ్ (బ్రిస్టల్)

జూన్ 23: ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ (హెడింగ్లీ)

జూన్ 24: ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (లార్డ్స్)

జూన్ 25: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)

జూన్ 25: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ (బ్రిస్టల్)

జూన్ 26: శ్రీలంక వర్సెస్ స్కాట్లాండ్ (ఓల్డ్ ట్రాఫోర్డ్)

జూన్ 27: పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ (బ్రిస్టల్)

జూన్ 27: వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్ (బ్రిస్టల్)

జూన్ 27: ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ (ది ఓవల్)

జూన్ 28: సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ (లార్డ్స్)

జూన్ 28: ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ (లార్డ్స్)

జూన్ 30: మొదటి సెమీఫైనల్ (ది ఓవల్)

జూలై 2: రెండో సెమీఫైనల్ (ది ఓవల్)

జూలై 5: గ్రాండ్ ఫైనల్ (లార్డ్స్)

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us