World Cup 2023: సెమీఫైనల్ లేదా ఫైనల్ టైగా ముగిస్తే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు? 2019 రూల్స్‌ను మార్చేసిన ఐసీసీ..

|

Nov 14, 2023 | 8:30 PM

ICC World Cup 2023: సెమీఫైనల్‌లో ICC ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం, “టై అయినట్లయితే, సూపర్ ఓవర్లు ఆడిస్తారు. అయితే, వాతావరణ పరిస్థితులు సూపర్ ఓవర్‌ను పూర్తి చేయకుండా అడ్డుకుంటే, లేదా మ్యాచ్ రద్దు చేయబడితే లేదా రిజర్వ్ డే ముగిసే సమయానికి ఫలితం రాకపోతే, లీగ్ దశలో ఉన్నత స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది".

World Cup 2023: సెమీఫైనల్ లేదా ఫైనల్ టైగా ముగిస్తే.. విజేతను ఎలా నిర్ణయిస్తారు? 2019 రూల్స్‌ను మార్చేసిన ఐసీసీ..
World Cup 2023
Follow us on

ICC ODI World Cup 2023: ODI ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. సెమీఫైనల్స్ నవంబర్ 15, 16 తేదీలలో జరగనున్నాయి. అలాగే ఫైనల్ నవంబర్ 19 న జరుగుతుంది. 2019 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్‌లు తలడిన సంగతి తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్ టై అయింది. అయితే, ఆ తర్వాత సూపర్ ఓవర్ నిర్వహించారు. అక్కడ కూడా మ్యాచ్ టైగా ముగిసింది. క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఫలితం వెలువడడంతో అంతా షాక్ అయ్యారు. ఎక్కువ బౌండరీలు బాదిన కారణంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు.

కానీ, 2023 ప్రపంచ కప్ కోసం నిబంధనలు మార్చారు. 2019 గందరగోళ నిర్ణయాన్ని పూర్తిగా మార్చేశారు. టై మ్యాచ్‌ల కోసం ICC నిబంధనల్లో ఎలాంటి మార్పులను తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం..

సెమీఫైనల్ లేదా ఫైనల్ టైగా ముగిస్తే ఏమి జరుగుతుంది?

“మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ టై అయితే, విజేత తేలేవరకు తదుపరి సూపర్ ఓవర్లు ఆడిస్తారు. అసాధారణమైన పరిస్థితులు తలెత్తకపోతే, ఫలితాన్ని సాధించడానికి అపరిమిత సంఖ్యలో సూపర్ ఓవర్లు ఆడాలి”అని ఐసీసీ ప్రకటించింది.

అంటే లీగ్ దశ మ్యాచ్ టైగా ముగిసి ఉంటే, టోర్నమెంట్‌లో నాకౌట్ కాని మ్యాచ్‌లో గతంలో ఎన్నడూ జరగని విధంగా సూపర్ ఓవర్‌కు ఆట కొనసాగుతుంది.

దీన్ని సులభతరం చేయడానికి, సెమీఫైనల్స్ లేదా ఫైనల్ ఏదైనా టైగా ముగిస్తే, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు మారుతుంది. అది కూడా టైగా ముగిస్తే మరో సూపర్ ఓవర్ ఆడిస్తారు. విజేత తేలేవరకు ఈ క్రమం కొనసాగుతుంది.

వాతావరణ పరిస్థితులు సూపర్ ఓవర్ జరగకుండా అడ్డుకుంటే ఏమి జరుగుతుంది?

సెమీఫైనల్‌లో ICC ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం, “టై అయినట్లయితే, సూపర్ ఓవర్లు ఆడిస్తారు. అయితే, వాతావరణ పరిస్థితులు సూపర్ ఓవర్‌ను పూర్తి చేయకుండా అడ్డుకుంటే, లేదా మ్యాచ్ రద్దు చేయబడితే లేదా రిజర్వ్ డే ముగిసే సమయానికి ఫలితం రాకపోతే, లీగ్ దశలో ఉన్నత స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది”.

కానీ, ఫైనల్‌లో ఇదే పరిస్థితి తలెత్తితే, ఫైనలిస్టులు ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..