Virat Kohli: విరాట్‌పై నోరు జారిన శ్రీలంక అభిమాని.. వీడియో వైరల్

శ్రీలంకపై టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్‌ వన్డేల కోసం సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కోహ్లీని ఉద్దేశించి ఓ శ్రీలంక అభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Virat Kohli: విరాట్‌పై నోరు జారిన శ్రీలంక అభిమాని.. వీడియో వైరల్
Kohli

Updated on: Aug 01, 2024 | 8:49 PM

శ్రీలంకపై టీ20 సిరీస్‌ను గెలిచిన భారత్‌ వన్డేల కోసం సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. శిక్షణ శిబిరంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కోహ్లీని ఉద్దేశించి ఓ శ్రీలంక అభిమాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. స్టార్‌ ఆటగాళ్లు రోహిత్, విరాట్ కోహ్లీతో కోచ్‌ గంభీర్‌ గేమ్‌ ప్లాన్‌పై చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లీని ‘చోక్లీ’గా పిలిచిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాన మ్యాచుల్లో సరైన ప్రదర్శన చేయని ఆటగాళ్లను చోకర్‌గా పిలుస్తుంటారు. దానికి కోహ్లీ పేరును జోడించి ‘చోక్లీ’గా అరిచినట్లు ఆ వీడియోలో వినిపించింది. దీంతో అతడిపై నెట్టింట పెద్దఎత్తున విమర్శలు రేగాయి. టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడని కొందరు గుర్తు చేశారు. అయితే, కొందరు దీనిని ఫేక్‌ వీడియోగా అభివర్ణించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us