Video: క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ వింత.. వైడ్ బాల్ డైరెక్ట్‌‌గా సిక్సర్

Video: కెనడా సూపర్ 60 లీగ్ సెమీఫైనల్‌లో అలీ ఖాన్ వేసిన వైడ్ బంతి కీపర్ తల మీదుగా బౌండరీ దాటి సిక్సర్‌గా వెళ్లినట్టు కనిపించిన ఘటన వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టొరంటో సిక్సర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 రన్ల భారీ స్కోరు సాధించింది.

Video: క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ వింత.. వైడ్ బాల్ డైరెక్ట్‌‌గా సిక్సర్
Wide Ball Six

Updated on: Oct 06, 2026 | 11:12 AM

Video: క్రికెట్ మైదానంలో సాధారణంగా వైడ్ వేస్తే బంతి కీపర్‌ని దాటుకుని బౌండరీకి వెళ్లి 5 రన్లు రావడం చూస్తుంటాం. కానీ ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఎవరూ ఊహించని విచిత్ర సంఘటన జరిగింది. బౌలర్ వేసిన ఒక వైడ్ బాల్ కీపర్ తల మీదుగా ఏకంగా డైరెక్ట్‌గా సిక్సర్‌గా వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కెనడా లీగ్‌లో అరుదైన వింత

కెనడా వేదికగా జరిగిన సూపర్ 60 లీగ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఈ వింత చోటుచేసుకుంది. టొరంటో సిక్సర్స్, మిస్సిసాగా మాస్టర్స్ జట్ల మధ్య ఈ ఉత్కంఠ పోరు జరిగింది. మిస్సిసాగా జట్టు తరఫున అమెరికా వేగవంతమైన బౌలర్ అలీ ఖాన్ బౌలింగ్ చేశాడు. ఆయన వేసిన ఒక డెలివరీ ఆఫ్ స్టంప్ అవతారంలో పిచ్ అయి ఊహించని రీతిలో భారీ బౌన్స్‌తో కీపర్ తల పైనుంచి బౌండరీ లైన్ అవతలకు వెళ్ళిపోయింది.

9వ ఓవర్లో పొలార్డ్‌కు దిమ్మతిరిగే బౌన్సర్

ఈ విచిత్ర సన్నివేశం మొదటి ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో జరిగింది. టొరంటో సిక్సర్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీరన్ పొలార్డ్‌‌కు అలీ ఖాన్ ఒక షార్ట్ బాల్ విసిరాడు. అయితే బంతి అనూహ్యంగా ఎగిరి కీపర్‌కు అందనంత ఎత్తులో స్టేడియం వైపు దూసుకెళ్లింది. క్రికెట్ నిబంధనల ప్రకారం వైడ్ ప్లస్ సిక్స్ కలిపి 7 రన్లు రావాలి, కానీ మైదానంలోని అంపైర్లు దీనికి 5 రన్లే కేటాయించడం గమనార్హం.

పొలార్డ్ విధ్వంసం.. టొరంటో సూపర్ స్కోర్

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టొరంటో సిక్సర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 రన్ల భారీ స్కోరు సాధించింది. కీరన్ పొలార్డ్ కేవలం 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 రన్లు చేసి విధ్వంసం సృష్టించాడు. ఆండ్రీస్ గౌస్ 33 రన్లతో రాణించాడు. 131 రన్ల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిస్సిసాగా మాస్టర్స్ జట్టు 10 ఓవర్లలో 7 వికెట్లకు 121 రన్లు మాత్రమే చేసి ఓటమి పాలైంది.

ఫైనల్‌కు చేరిన టొరంటో సిక్సర్స్

మిస్సిసాగా జట్టులో అలెక్స్ లీస్ 11 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 39 రన్లు చేసి గెలిపించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరికి టొరంటో సిక్సర్స్ జట్టు 9 రన్ల తేడాతో విజయం సాధించి టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లోని అలీ ఖాన్ వైడ్ సిక్సర్ బాల్ ఇప్పుడు క్రికెట్ అభిమానులకు విపరీతమైన వినోదాన్ని అందిస్తోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us